ఇప్పుడు నమ్మలేకపోతున్నా.. రానా భార్య కామెంట్స్ వైరల్..?

టాలీవుడ్ ఇండస్ట్రీ క్యూట్ కపుల్స్ లో రానా మిహీకా జోడీ ఒకటనే సంగతి తెలిసిందే.రానా ఒక హీరోయిన్ తో ప్రేమలో ఉన్నారని ప్రచారం జరగగా రానా మాత్రం మిహీకాతో లవ్ లో ఉన్నానని ఆమె తన ప్రేమకు యస్ చెప్పిందని ఏడాది క్రితం తెలిపారు.

 Rana Wife Miheeka Bajaj Post Goes Viral In Social Media-TeluguStop.com

తాజాగా మిహీకా బజాజ్ రానా ప్రపోజ్ చేసిన తరువాత ఏం జరిగిందో తన పోస్ట్ ద్వారా వెల్లడించే ప్రయత్నం చేశారు.రానా అడిగిన వెంటనే తాను ఒకే అన్నానని ఆమె పేర్కొన్నారు.

రానా లవ్ ప్రపోజల్ కు ఓకే చెప్పడం తాను లైఫ్ లో తీసుకున్న బెస్ట్ డెషిసన్ అని మిహీకా బజాజ్ వెల్లడించారు.రానా తనకు ప్రపోజ్ చేసి సంవత్సరం అయిందనే విషయాన్ని తాను అస్సలు నమ్మలేకపోతున్నానని ఆమె పేర్కొన్నారు.

 Rana Wife Miheeka Bajaj Post Goes Viral In Social Media-ఇప్పుడు నమ్మలేకపోతున్నా.. రానా భార్య కామెంట్స్ వైరల్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తనకు ప్రపోజ్ చేసినందుకు రానాకు ధన్యవాదాలు అని మిహీకా బజాజ్ చెప్పుకొచ్చారు.భర్త రానాకు ఐలవ్యూ చెబుతూ మిహీకా బజాజ్ తన పోస్ట్ ను ముగించారు.ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

మరోవైపు పెళ్లికి ముందుతో పోలిస్తే పెళ్లి తర్వాత రానా ఎక్కువగా సినిమాల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.

ఇప్పటికే రానా నటించిన అరణ్య సినిమా రిలీజై ఫ్లాప్ ఫలితాన్ని అందుకోగా విరాటపర్వం సినిమా ఓటీటీలో రిలీజ్ కానుందని వార్తలు వస్తున్నాయి.అయితే ఈ సినిమా నిజంగా ఓటీటీలో రిలీజవుతుందో లేదో తెలియాల్సి ఉంది.

ఈ సినిమాలతో పాటు అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ లో రానా నటిస్తున్నారు.

కరోనా కేసులు తగ్గి షూటింగ్ మొదలైతే దసరా పండుగకు ఈ సినిమాను విడుదల చేయాలని ఆ సినిమా దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.ఈ సినిమాకు తెలుగు టైటిల్ ఇంకా ఫిక్స్ కావాల్సి ఉంది.

#Rana #Socila Media #MihikaI #Miheeka Bajaj

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు