ఏనుగులతో ఆ ఒక్క రోజు భయమేసిదంటున్న రానా..!

టాలీవుడ్ సినీ నటుడు రానా ప్రధాన పాత్రలో నటించిన సినిమా అరణ్యఈ సినిమా ప్రభు సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కనుంది.ఇక ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఏనుగుల నేపథ్యంలో బాగా ఆకట్టుకుంది.

 Rana Who Was Scared With Elephants That One Day  Rana , Elephants, Tollywood, Ar-TeluguStop.com

అంతేకాకుండా ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు కూడా వచ్చాయి.ఇక ఈ సినిమా మార్చి 26న విడుదల కానుంది.

ఈ సినిమా రిలీజ్ వేడుకలో కూడా జరుగగా ముఖ్యఅతిథిగా స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ హాజరైన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే రానా ఈ సినిమా విడుదల సందర్భంగా విలేకరులతో కొన్ని విషయాలు పంచుకున్నాడు.

అస్సాంలోని కాజీరంగా ప్రాంతంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా దర్శకుడు ఈ కథను రాసుకున్నారని, ఆయన స్క్రిప్ట్ వినిపిస్తున్నప్పుడే తెలియకుండానే తనలో తెలియని ఉత్సాహం కలిగిందని రానా తెలిపాడు.ప్రభు కుంకిఅనే సినిమా చేస్తున్నప్పుడే ఏనుగుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేశానంటూ దాదాపు నాలుగేళ్లు ఈ ప్రాజెక్టు కోసం వెచ్చించారని తెలిపాడు.

Telugu Aranya, Rana, Tollywood-Movie

ఇక ఇందులో 18 ఏళ్ల క్రితం సాగే ప్రయాణం కొత్త అనుభూతిని పంచుతుందని, షూటింగ్ కి 15 రోజుల ముందే థాయిలాండ్ వెళ్ళమంటూ, ప్రతిరోజు తను, ప్రభు అడవికి వెళ్ళి తన పాత్రకి, అక్కడున్న మొక్క కి ఏంటి సంబంధం? తనకు, కుందేలుకు ఏంటి సంబంధం? అని చర్చించుకునేవాళ్లట‌.అడవిలో ఉండే ప్రతి జీవి తన పాత్ర ముడిపడి ఉంటుందని, శిక్షకుల సాయంతో ఏనుగులకు స్నానం చేయించి ఆహారం అందించి వాటిని మచ్చిక చేసుకున్నానని తెలిపారు.కానీ ఏనుగులతో ఆ ఒక్కరోజు చాలా భయపడ్డాడట.

ఏనుగులు మనుషుల్ని ఓ ఎనర్జీతో గుర్తిస్తాయని, తాకితే చాలు ఎవరు అనే విషయం ఇట్టే కనిపెట్టేస్తాయని చెప్పుకొచ్చాడు రానా.

ఆయన తొలినాళ్లలో అవి ఏమైనా చేస్తాయన భయంతో అరటిపండు, బెల్లం జేబులో పెట్టుకుని తిరిగే వాడట.ఓ సారి తన జేబులో నుంచి అరటిపండు బయటికొచ్చిన సంగతి తను గుర్తించలేదట.

ఇక అరటిపండు చూడగానే ఎక్కడున్నా అన్ని ఏనుగులు తన వైపు వస్తుండటంతో చాలా భయపడ్డాను అంటూ, కానీ అనుకున్నంత ఏం జరగలేదు, వారం రోజుల్లోనే వాటితో స్నేహం పెంచుకున్నానని తెలిపారు.ఇక ఆ సినిమా గురించి మరికొన్ని విషయాలను పంచుకున్నాడు రానా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube