ఆకాశవాణిని బట్టబయలు చేస్తున్న రానా  

Rana To Release Aakashavaani First Look Poster, Rana Daggubati, Aakashavaani, First Look Poster, Aranya - Telugu Aakashavaani, Aranya, First Look Poster, Rana Daggubati

టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నాడు.ఇప్పటికే అరణ్య అనే సినిమాను రిలీజ్‌కు రెడీ చేసిన రానా, తన నెక్ట్స్ చిత్రాలను కూడా లైన్‌లో పెట్టే పనిలో ఉన్నాడు.

 Rana To Release Aakashavaani First Look Poster

ఇటు పర్సనల్ లైఫ్‌లో మిహికా బజాజ్‌తో పెళ్లికి కూడా రెడీ అయ్యాడు ఈ హీరో.కాగా టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టుల్లో ఒకటైన ఆకాశవాణి అనే సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రానా రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యాడు.

దర్శకధీరుడు రాజమౌళి కొడుకు ఎస్ఎస్ కార్తికేయ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడనే వార్తతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నుండి ఆయన తప్పుకున్నాడు.

ఆకాశవాణిని బట్టబయలు చేస్తున్న రానా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అటు రాజమౌళి అసిస్టెంట్ అయిన అశ్విన్ గంగరాజు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా ఆకాశవాణి అనే టైటిల్ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్‌ను క్రియేట్ చేసింది.ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆగష్టు 2న రానా చేతుల మీదుగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

పూర్తి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.ఇక ఈ సినిమాకు కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు.

మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.ఇక ఈ సినిమాకు జక్కన్న ఆల్ ది బెస్ట్ చెప్పడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచాలు ఏర్పడ్డాయి.

#Aakashavaani #Aranya #Rana Daggubati

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rana To Release Aakashavaani First Look Poster Related Telugu News,Photos/Pics,Images..