రానా షాకింగ్ లుక్స్ వెనుక అసలు కారణం ఏంటి  

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రానా లుక్స్ .

Rana Shocking Looks Exciting And Viral-telugu Cinema,tollywood,viral,virataparvam Movie

బాహుబలి సినిమాతో దేశ వ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్న నటుడు దగ్గుబాటి రానా. టాలీవుడ్ లో అందరి హీరోలకి భిన్నంగా నటుడుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకునే దిశగా రానా అడుగులు వేస్తున్నాడు. అలాగే నటుడుగా తనని నిరూపించుకునే క్రమంలో ఎప్పటికప్పుడు తన లుక్, ఆహార్యం మార్చుకుంటూ వెళ్తున్నాడు..

రానా షాకింగ్ లుక్స్ వెనుక అసలు కారణం ఏంటి-Rana Shocking Looks Exciting And Viral

ప్రస్తుతం హిందీ, తెలుగు భాషలలో తెరకెక్కుతున్న హథి మేరి సాథి అనే సినిమాలో రానా నటిస్తున్నాడు. ఈ సినిమాలో రానా అడవిలో ఏనుగులని హ్యాండిల్ చేసి మావటివాడు పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకి సంబంధించి రానా లుక్ ఒకటి బయటకి వచ్చింది.

ఈ లుక్ లో రానా చాలా నాటుగా నెగిటివ్ షేడ్స్ లో కనిపిస్తున్నాడు. ఈ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు రానా ఈ రేంజ్ లో బాడీ, లుక్ మార్చాడంటే ఆ పాత్రలో ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుంది అని చెప్పుకుంటున్నారు.

ఎన్టీఆర్ సినిమాలో క్లీన్ సేవ్ లో చంద్రబాబు పాత్రలో కనిపించి మెప్పించిన రానా ఇప్పుడు ఏకంగా మాసిన గడ్డంతో కనిపించడం ఆసక్తి కలిగిస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తర్వాత విరాటపర్వంలో రానా ఎలా కనిపించబోతున్నాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.