రానా ఇంత బక్కగా అయ్యాడేంటి.. అనారోగ్యం కారణమా?  

Rana Shocking Look At Venky Mama Movie Opening-

బాహుబలి చిత్రంలో భల్లాలదేవుడి పాత్రలో రానా ఎంతగా అలరించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ పాత్ర కోసం ఏకంగా 100 కేజీల బరువు పెరిగిన రానా, కండలు తిరిగిన శరీర శౌష్టవంతో అందరిని అలరించాడు. టాలీవుడ్‌ హంక్‌గా పేరు తెచ్చుకున్న రానా గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. మీడియాలో వస్తున్న వార్తలను ఎప్పటికప్పుడు దగ్గుబాటి ఫ్యామిలీ కొట్టి పారేస్తూ ఉన్నప్పటికి సోషల్‌ మీడియాలో మాత్రం పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి...

రానా ఇంత బక్కగా అయ్యాడేంటి.. అనారోగ్యం కారణమా?-Rana Shocking Look At Venky Mama Movie Opening

రానా ఆనారోగ్యంతో బాధపడుతున్నట్లుగా ఆయనను చూసిన ఎవరైనా చెప్పవచ్చు అంటూ సోషల్‌ మీడియాలో గుసగుసలాడుకుంటున్నారు.

తాజాగా వెంకటేష్‌ మరియు నాగచైతన్యలు కలిసి నటించబోతున్న ‘వెంకీ మామ’ చిత్రం షూటింగ్‌ కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. ఆ చిత్రాన్ని సురేష్‌బాబు నిర్మిస్తున్న కారణంగా రానా షూటింగ్‌ ప్రారంభోత్సవంకు హాజరు అయ్యాడు.

భల్లాలదేవుడిగా మంచి ఆహార్యంతో కనిపించిన రానా ఇప్పుడు చాలా బక్కగా అయ్యాడు. దాదాపు ముప్పై కేజీల బరువు తగ్గినట్లుగా అనిపిస్తున్నాడు. మొహంలో కూడా గతంలో ఉన్న కళ కనిపించడం లేదనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

రానా ఇలా అయ్యాడేంటి అంటూ మీడియా వారు కూడా గుసగుసలాడుకున్నట్లుగా తెలుస్తోంది.

రానాకు ఒక కన్ను సమస్య ఉందని, త్వరలోనే ఆ కన్ను ఆపరేషన్‌ అమెరికాలో జరుగబోతుంది. ఆపరేషన్‌ కోసం సిద్దం అవుతున్న సమయంలో రానా కాస్త డైట్‌ ఫాలో అవుతున్నాడని, ఆ కారణం వల్లే కాస్త లావు తగ్గాడు అంటూ ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మరో వైపు రానా బాహుబలి కోసం పెరిగిన బరువు తగ్గి కొత్త సినిమాల్లో కనిపించాలనుకుంటున్నాడు.

అందుకే ఇలా బరువు తగ్గాడు అంటూ మరి కొందరు చెబుతున్నారు. మొత్తానికి రానా బరువు తగ్గడం చర్చనీయాంశం అయ్యింది...

కాస్త బరువు తగ్గితే పర్వాలేదు కాని, రానా అనూహ్యంగా తన మొదటి సినిమా ‘లీడర్‌’లో ఎలా ఉన్నాడో ఇప్పుడు అలా ఉన్నాడు.

గతంలో రానాను బక్కగా ఉన్నాడు అంటూ అంతా ఎద్దేవ చేసేవారు. అందుకే కాస్త లావు అయ్యాడు. మళ్లీ ఇప్పుడు బక్కగా కావాలని అవ్వడు.

అనారోగ్య కారణం వల్లే రానా బక్కగా అయ్యి ఉంటాడు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక రానా గత కొంత కాలంగా ఏ ఒక్క సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాలేక పోయాడు. అందుకు కారణం ఏంటీ అనే విషయంలో క్లారిటీ లేదు.