ఇట్స్ అఫీషియల్… ఎంగేజ్మెంట్ ఫోటోలు షేర్ చేసిన రానా  

Rana Shared Engagement Photos - Telugu Lock Down,, Suresh Babu, Telugu Cinema, Tollywood

ఇటీవల తన ప్రేమ విషయం చెప్పిన మన బల్లాలదేవ రానా త్వరలో ఓ ఇంటివాడు కావడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.గత రెండు రోజులుగా అతని నిశ్చితార్ధం అయిపోయినట్లు వార్తలు వచ్చాయి.

 Rana Shared Engagement Photos

అయితే అవి వాస్తవం కాదనే మాట కూడా వినిపించింది.అయితే ఇంతలో ఊహించని విధంగా రానా తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఇట్స్ అఫీషియల్ అంటూ మిహికాతో తాను సంప్రదాయ దుస్తులలో ఉన్న ఫోటోలు షేర్ చేశాడు.

ఫోటోలు చూస్తూ ఉంటే వారికి నిశ్చితార్ధం జరిగిపోయిందని అర్ధమవుతుంది.రామానాయుడు స్టూడియోలో నిన్న సాయంత్రం 4 గంటలకు మిహీకా బజాజ్, రానాల నిశ్చితార్ధ వేడుక జ‌ర‌గ‌నుందని ఉదయం వార్తలు వచ్చాయి.

ఇట్స్ అఫీషియల్… ఎంగేజ్మెంట్ ఫోటోలు షేర్ చేసిన రానా-Movie-Telugu Tollywood Photo Image

అయితే మర్యాదపూర్వకంగానే ఇరు కుటుంబాలు కలుస్తాయని నిన్న రానా తండ్రి సురేష్ బాబు అన్నారు.తాజాగా, రానా పోస్టు చేసిన ఫొటోల్లో ఆయన పంచెకట్టులో, మిహీకా పట్టుచీరలో కనపడ్డారు.

రోజు రానా పోస్ట్ చేసిన ఫొటోలు చూస్తుంటూ వారి నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది.

ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ అభిమానులు పెద్ద ఎత్తున ట్వీట్లు చేస్తున్నారు.కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా కొద్ది కుటుంబ స‌భ్యుల మధ్య వారి నిశ్చితార్థం జరిగినట్లు టాక్.అయితే అది నిశ్చితార్ధం వేడుక కాదని హిందూ సంప్రదాయం ప్రకారం జరిగే పెళ్లి చూపులు అనే మాట కూడా వినిపిస్తుంది.

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు