పవన్ నుండి రోజు ఏదొక విషయం నేర్చుకోవచ్చు అంటున్న రానా..!

రానా దగ్గుబాటి.సీనియర్ నిర్మాత సురేష్ బాబు కొడుకుగా వెంకటేష్ తర్వాత వాళ్ళ కుటుంబం నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రానా.

 Rana Says Pawan Kalyan Knowledge About Cinema Is Vast-TeluguStop.com

లీడర్ సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని ఆ తరవాత కూడా విభిన్న కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా తో తన పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగి పోయింది.

Telugu Ayyappanum Koshiyum, Director Sagar K Chandra, Nidhi Agrawal, Nithya Menon, Pawan Kalyan, Pawan Movie Update, Rana Daggubati, Rana Says Pawan Kalyan Knowledge About Cinema Is Vast-Movie

ప్రస్తుతం రానా దగ్గుబాటి వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.ఈ మధ్యనే డైరెక్టర్ ప్రభు సాలొమోన్ దర్శకత్వంలో తెరకెక్కిన అరణ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ సినిమా లో కూడా విలక్షణ నటనతో అందరి ప్రశంసలు పొందాడు.అయితే ప్రస్తుతం రానా పవన్ కళ్యాణ్ తో కలిసి ”అయ్యప్పనుమ్ కోషియం” అనే రీమేక్ సినిమాలో నటిస్తున్నారు.

 Rana Says Pawan Kalyan Knowledge About Cinema Is Vast-పవన్ నుండి రోజు ఏదొక విషయం నేర్చుకోవచ్చు అంటున్న రానా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమా యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ కూడా చాలా వరకు పూర్తి చేసారు.

ఈ నేపథ్యంలో రానా పవన్ తో కలిసి పనిచేయడం గురించి మీడియాతో తన అనుభవాలను పంచుకున్నారు.పవన్ కళ్యాణ్ ఏ పాత్రనైనా యిట్టె అర్ధం చేసుకుంటారని.

ఆయనకు సినిమాపై అపారజ్ఞానం ఉంటుందని రానా పవన్ గురించి చెప్పారు.

Telugu Ayyappanum Koshiyum, Director Sagar K Chandra, Nidhi Agrawal, Nithya Menon, Pawan Kalyan, Pawan Movie Update, Rana Daggubati, Rana Says Pawan Kalyan Knowledge About Cinema Is Vast-Movie

ఎంతో అనుభవం ఉన్న వ్యక్తుల వద్ద చాలా నేర్చుకోవచ్చని.అలాగే పవన్ నుండి రోజు ఏదొక కొత్త విషయం నేర్చుకోవచ్చని రానా అభిప్రాయం పడ్డాడు.ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే మరియు మాటలు అందిస్తున్నాడు.

ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్నారు.థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఈ సినిమా లో రానాకు జోడీగా ఐశ్వర్య రాజేష్.పవన్ కు జోడీగా నిత్యా మీనన్ ను ఫిక్స్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.

#RanaSays #Nithya Menon #Nidhi Agrawal #DirectorSagar #Rana Daggubati

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు