అరణ్య బాహుబలి కంటే ఎక్కువే అంటోన్న రానా

టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి బాహుబలి చిత్రంతో ఎలాంటి గుర్తింపును తెచ్చుకున్నాడో అందరికీ తెలిసిందే.ఈ సినిమాలో రానా చేసిన యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

 Rana Says Aranya Was Tougher Than Baahubali-TeluguStop.com

ఇక బాహుబలి చిత్రం తరువాత రానా తిరిగి వెనక్కి చూసుకోలేదు.ఇక ఆ తరువాత వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న రానా, ప్రస్తుతం అరణ్య అనే సినిమాలో నటిస్తున్నాడు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అయ్యింది.

పూర్తి వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ప్రేక్షకులు అమితంగా ఆకట్టుకున్నాయి.

కాగా ఈ సినిమాలో రానా చాలా డిఫరెంట్ గెటప్‌లో కనిపిస్తున్నాడు.అయితే ఈ గెటప్ కోసం రానా చాలా సన్నబడ్డాడు.

కాగా ఈ సినిమాలో ఏనుగులను సంరక్షించే వ్యక్తిగా రానా కనిపిస్తాడు.ఇందులో భాగంగా ఆయన ఏనుగుల తొండాలను మోస్తూ మనకు కనిపిస్తాడని, ఈ షూటింగ్‌లో పాల్గొనడం చాలా కష్టంగా ఉండేదని ఆయన తెలిపాడు.

ఏనుగు తొండం ఏకంగా 160-170 కిలోల బరువు ఉండటంతో ఈ సినిమా షూటింగ్ సమయంలో చాలా కష్టపడ్డానని ఆయన అన్నాడు.

బాహుబలి చిత్రంలో పాల్గొనడం కంటే అరణ్య సినిమా షూటింగ్ సమయంలోనే తాను చాలా ఇబ్బంది పడ్డానని రానా చెప్పుకొచ్చాడు.

ఇక ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడంలో పూర్తిగా సక్సెస్ అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ఇక ఈ సినిమా ఓ మంచి సోషల్ మెసేజ్‌ను మనకు అందిస్తుండగా, ఈ సినిమాను ప్రభు సోలోమాన్ డైరెక్ట్ చేస్తున్నాడు.

పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube