ఆ విషయంలో పవన్ కు రానా ఏ మాత్రం తీసిపోరట..?

ప్రస్తుతం వస్తున్న సినిమాల్లో ఎక్కువగా హీరో పాత్ర కంటే.ఇతర పాత్రలు కూడా బాగా ఆసక్తి గా మారాయి.

 Rana Role Will Be Equal To Pawans Role-TeluguStop.com

తాజాగా వచ్చిన ఉప్పెన సినిమాలో కూడా హీరో పాత్ర కంటే విలన్ పాత్రలో నటించిన విజయ్ సేతుపతి పాత్రను ఎక్కువగా ఆసక్తి తో చూపారు.అందుకే ఈ సినిమాలో విలన్ పాత్ర బాగా ఆకట్టుకుంది.

దీనిని ఉద్దేశించి ప్రస్తుతం దర్శకులు హీరోతో పాటు విలన్ పాత్ర కూడా సమానంగా ఉండాలని నిర్ణయించుకుంటారు.ప్రస్తుతం పవన్ సినిమాలో కూడా రానా పాత్ర కూడా అలాగే ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

 Rana Role Will Be Equal To Pawans Role-ఆ విషయంలో పవన్ కు రానా ఏ మాత్రం తీసిపోరట..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా ‘అయ్యప్పన్ కోషియుమ్’ రీమేక్ చేసిన సంగతి తెలిసిందే.ఈ సినిమాకు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమాలో రానా నటించనుండగా ఆయన పాత్ర హీరో పవన్ కళ్యాణ్ తో సమానంగా ఉండాలని ప్లాన్ చేస్తున్నారట‌.ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లుక్ ను మాత్రం బయటకు లీక్ చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట‌ సినీ బృందం.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ గెటప్ లో కనిపించనున్నాడు.అంతేకాకుండా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లుక్ చాలా సన్నగా కనిపించనున్నాడట.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సమయంలో బిజీగా ఉంది.ఇక ఇందులో రానా పాత్ర కోసం కొన్ని ఏర్పాట్లను కూడా చేయనున్నారు.పవన్ పాత్రతో సమానంగా ఉండాలంటూ సినీ దర్శక నిర్మాతలు భారీగానే ఏర్పాటు చేస్తున్నారు.ఇక ఈ సినిమా గురించి పవన్ అభిమానులు భారీగా అంచనాలు చేస్తున్నట్లు అర్థమవుతుంది.

ఇక ఈ సినిమాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, మాటలను అందిస్తున్నాడు.ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాను అందిస్తుంది.

#Pawan Kalyan #Rana #Rana Daggubati #Pawan #RanaRole

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు