రానా వల్లే హౌస్ ఫుల్-4 లో పూజా కు అవకాశం  

Rana Recumended Pooja In Housefull-4-housefull-4,puja Hegde,హౌస్ ఫుల్-4

ఇటీవల టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా చలామణి అవుతున్న నటి పూజా హెగ్డే. హైట్ ఆమెకు ప్లస్ పాయింట్ కావడం తో విజయాల విషయం ఎలా ఉన్నా దాదాపు అందరి పక్కన హీరోయిన్ గా నటిస్తూ బిజీ గా ఉంది పూజా. అయితే ఇప్పుడు ఈ భామ బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టినట్లు తెలుస్తుంది..

రానా వల్లే హౌస్ ఫుల్-4 లో పూజా కు అవకాశం-Rana Recumended Pooja In Housefull-4

బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ తో జోడి జట్టనున్నట్లు సమాచారం. ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రభాస్ తో జాన్ సినిమా చేస్తున్న పూజా బాలీవుడ్ లో అక్షయ్ తో హౌస్ ఫుల్ 4 లో అవకాశం వచ్చింది.

ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, రితేష్ దేశ్ ముఖ్,రానా తదితరులు నటిస్తున్న ఈ చిత్రంలో పూజా తో పాటు కృతి సనన్,కృతి కర్బంద లు కూడా నటిసున్నారు. అయితే అక్షయ్ కు జోడి గా పూజా ఈ చిత్రంలో నటిస్తుంది. అయితే ఈ చిత్రంలో పూజా కి అవకాశం రావడానికి ఆమె ట్యాలెంట్ కంటే ముందు రానా రికమండేషన్ అని వార్తలు వినిపిస్తున్నాయి.

రానా రికమండ్ చేయడం తో పూజా కు హౌస్ ఫుల్-4 లో అవకాశం వచ్చినట్లు తెలుస్తుంది..

టాలీవుడ్ కెరీర్ స్టార్ట్ చేసిన కొత్తలో పెద్దగా విజయాలు అందుకోనప్పటికీ అల్లు అర్జున్ తో డీజే సినిమా చేసిన తరువాత ఒక్కసారిగా ఈ అమ్మడి కెరీర్ మారిపోయింది. ఆ తరువాత అరవింద సమేత సినిమా సూపర్ హిట్ కావడంతో మళ్లీ ఇటీవల విడుదల అయిన మహర్షి కూడా హిట్ కొట్టడం తో ఆమె కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. ప్రస్తుతం జాన్ సినిమా తో ప్రభాస్ తో జోడీ కట్టిన ఈ అమ్మడు ఈ చిత్రం గనుక విజయం సాధిస్తే మాత్రం పూజా కెరీర్ టోటల్ గా మారిపోతుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నారు.

బాలీవుడ్ లో కూడా పూజా హిట్ కొడితే అక్కడ కూడా తన కెరీర్ ను కొనసాగించే అవకాశాలు లేకపోలేదు.