రానా కోలీవుడ్ జెర్సీ  

Rana Planning To Jersey Remake In Tamil-

బాహుబలి విలన్ రానా దగ్గుబాటి ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు.హాథి మేరీ సాతి సినిమాతో పాటు మరో రెండు సినిమా షూటింగ్స్ లలో రెగ్యులర్ గా పాల్గొంటున్నాడు.అయితే హీరోగానే కాకుండా తండ్రి తరహాలో నిర్మాతగా అడుగులు వేస్తున్నాడు...

Rana Planning To Jersey Remake In Tamil--Rana Planning To Jersey Remake In Tamil-

తాత రామానాయుడి స్థాయికి తగ్గట్టుగా బాషాభేదం లేకుండా సరికొత్త సినిమాలను ప్రొడ్యూస్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు.

Rana Planning To Jersey Remake In Tamil--Rana Planning To Jersey Remake In Tamil-

ఇప్పటికే ఓ బేబీ ని హిందీలో రీమేక్ చేసేందుకు సిద్దమైన ఈ స్టార్ యాక్టర్ టాలీవుడ్ రీసెంట్ హిట్ జెర్సీని కోలీవుడ్ లో నిర్మించేందుకు ప్రయత్నాలు జరుపుతున్నాడు.గత ఏప్రిల్ నెలలో వచ్చిన జెర్సీ క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సంగతి తెలిసిందే.నాని కి మంచి హిట్ ఇచ్చిన ఆ సినిమా బాలీవుడ్ లో దిల్ రాజు – అల్లు అరవింద్ రీమేక్ చేయనున్నారు.

ఇక రానా కోలీవుడ్ యువ హీరో విష్ణు విశాల్ ని కథానాయకుడిగా సెలెక్ట్ చేసుకొని గ్రాండ్ గా ప్రొడ్యూస్ చేయనున్నట్లు సమాచారం.త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వెలువడనుంది.