బాలీవుడ్ డైరక్టర్ తో రానా..!

దగ్గుబాటి వారసుడు రానా ప్రస్తుతం విరాటపర్వం సినిమాతో త్వరలో రాబోతున్నాడు.ఇక ఈ సినిమా తర్వాత బాలీవుడ్ డైరక్టర్ మిలింద్ రావ్ తో ఒక సినిమా ఫిక్స్ చేసుకున్నాడు.

 Rana Movie With Bollywood Director Milind Rao, Rana Movie ,milind Rao , Tollywoo-TeluguStop.com

ఆ సినిమాకు సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చింది.మిలింద్ రావ్ డైరక్షన్ లో రానా చేస్తున్న సినిమా పాన్ ఇండియా సినిమాగా వస్తుంది.

ఈ విషయాన్ని చిత్రయూనిట్ అఫీషియల్ గా ప్రకటించింది.ఈ సినిమాను స్పిరిట్ మీడియా నిర్మిస్తుంది.

విశ్వశాంతి పిక్చర్స్ వారు ఈ సినిమాకు సహ నిర్మాతలుగా ఉంటున్నారు.

తెలుగుతో పాటుగా బాలీవుడ్ లో కూడా సినిమా చేస్తున్న రానా బాహుబలి సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు.

అరణ్య సినిమాతో పాన్ ఇండియా అటెంప్ట్ చేసిన రానా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.అందుకే మరోసారి ఆ ప్రయత్నం చేస్తున్నాడు.మిలింద్ రావ్ తో రానా సినిమా క్రేజీగా ఉంటుందని అంటున్నారు.బాలీవుడ్ క్రేజీ సినిమాలు చేస్తూ అలరిస్తున్న మిలింద్ రావ్ రానాతో ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.

ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో భారీగా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారట.

బడ్జెట్ కూడా భారీగా కేటాయించినట్టు టాక్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube