రానా సినిమాకు కూడా అదే తప్పు చేయబోతున్నారా?  

Rana Movie Virat Parvam Movie Updates - Telugu Baahubali Budzet, Jaanu, Rana, Sai Raa Narasimha Reddy, Suresh Babu, Telugu Viral News Updates, Tollywood Gossips, Venkatesh, Virat Parvam Movie

ఈమద్య సినిమాల బడ్జెట్‌లు అమాంతం పెరిగి పోతున్నాయి.ముఖ్యంగా తెలుగు సినిమా బడ్జెట్‌లు బాలీవుడ్‌ సినిమాలతో పోటీ పడుతున్నాయి.

Rana Movie Virat Parvam Movie Updates

కొన్ని సార్లు బాలీవుడ్‌ సినిమాల స్థాయిని మించుతున్నాయి.బాహుబలి, సాహో, సైరా వంటి సినిమాలు బాలీవుడ్‌ను మించిన బడ్జెట్‌తో తెరకెక్కాయి.

అయితే ఒకటి రెండు సినిమాలు మాత్రమే వసూళ్లను సాధిస్తున్నాయి.ఎక్కువ వసూళ్లు సాధించినా కూడా భారీ బడ్జెట్‌ కారణంగా నిర్మాతలకు నష్టాలు తప్పడం లేదు.

సాహో చిత్రం 300 కోట్ల బడ్జెట్‌ అవ్వడం వల్ల భారీ వసూళ్లు సాధించినా కూడా 100 కోట్ల వరకు నష్టాలే మిగిలినట్లుగా సమాచారం అందుతోంది.అలాగే సాహో సినిమా కూడా దాదాపుగా 150 కోట్ల వరకు నష్టాలను మిగిల్చిందేమో అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

హీరో మార్కెట్‌ మరియు పరిధిని బట్టి బడ్జెట్‌ను ప్లాన్‌ చేసుకోవాలి.అలా కాదని ఇష్టానుసారంగా ఖర్చు చేస్తే అడ్డంగా బుక్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఈ విషయంతో మరో సారి రుజువు అయ్యింది.

అయినా కూడా రానా తన సినిమాను భారీ బడ్జెట్‌తో ప్లాన్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.రానా మార్కెట్‌ పాతిక కోట్లు.అంతకు మించి ఆయన సినిమాకు ఖర్చు చేస్తే వెనక్కు రావడం చాలా చాలా కష్టం.అద్బుతం ఆవిష్కారం అయితే కాని చెప్పలేం.రానా ప్రస్తుతం విరాటపర్వం చిత్రాన్ని చేస్తున్నాడు.నక్కలైట్స్‌ నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతుంది.

ఈ చిత్రం కోసం హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌ను రప్పించడంతో పాటు అనేక విషయాల్లో భారీగా ప్లాన్‌ చేస్తున్నాడట.ఈ చిత్రం కోసం 35 నుండి 40 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

రానా గతంలో జరిగిన తప్పునే మళ్లీ పునరావృతం చేస్తున్నట్లుగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rana Movie Virat Parvam Movie Updates Related Telugu News,Photos/Pics,Images..

footer-test