ధృవ సినిమాను మిస్ చేసుకున్న రానా.. ఎందుకో తెలుసా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినీ బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి వచ్చిన హీరోలలో రానా దగ్గుబాటి ఒకరు.తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి లీడర్ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన రానా కేవలం తెలుగులో మాత్రమే కాకుండా బాలీవుడ్ తమిళ సినిమాలలో కూడా నటించారు.

 Rana Missed Dhruva Movie Do You Know Why-TeluguStop.com

అదే విధంగా బాహుబలి చిత్రం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.ఆయన నిత్యం ఏదో ఒక సినిమాతో బిజీగా ఉంటారు.

కథల ఎంపిక విషయంలో రానా ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే తనకు కథ నచ్చకపోతే ఎలాంటి స్టార్ డైరెక్టర్ సినిమా అయినా ఎంతో సునాయాసంగా ఆ సినిమాను తిరస్కరిస్తారు.

 Rana Missed Dhruva Movie Do You Know Why-ధృవ సినిమాను మిస్ చేసుకున్న రానా.. ఎందుకో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ విధంగా కెరియర్ లో స్టార్ డైరెక్టర్ సినిమా ఆఫర్లు వచ్చినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమాలను వదులుకున్న సందర్భాలు ఉన్నాయి.ఇలా తెలుగులో పాటు తమిళంలో కూడా ఎంతో మంచి క్రేజ్ సంపాదించుకున్న రానా తమిళంలో ఒక మంచి అవకాశం రావడంతో కొన్ని కారణాల వల్ల ఆ సినిమాను వదులుకున్నారు.

మరి ఆ సినిమా ఏంటి ఎందుకు వదులుకున్నారనే విషయానికి వస్తే… తెలుగులో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించినటువంటి ధృవ సినిమా ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ సినిమాను తమిళంలో తెరకెక్కించాలని, అందులో హీరో పాత్రలో రానాను సంప్రదించగా రానా ఈ సినిమాకు నో చెప్పారు.

Telugu Dhruva, Hero, Rana, Tollywood-Movie

తెలుగులో ధ్రువగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని తమిళంలో మోహన్ రాజా దర్శకత్వంలో తని ఒరువన్ .అనే పేరుతో తెరకెక్కింది.ఇందులో జయం రవి హీరోగా నటించారు.ముందుగా ఈ చిత్రంలో హీరోగా నటించడానికి రానాను సంప్రదిస్తే అప్పటికి రానా బాహుబలి చిత్రంతో ఎంతో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమాలో నటించడానికి కుదరలేదు.

ఈ విధంగా డేట్స్ అడ్జస్ట్ కాని కారణంగా రానా తని ఒరువన్ సినిమాను మిస్ చేసుకున్నారని చెప్పవచ్చు.

#Rana #Dhruva #Hero

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు