అంగరంగ వైభవంగా రానా మిహికాల వివాహం  

Rana Miheeka Marriage photos viral, Rana Daggubati, Miheeka Bajaj, Marriage Photos, Allu Arjun, Naga Chaitanya With Samantha - Telugu Allu Arjun, Marriage Photos, Miheeka Bajaj, Naga Chaitanya With Samantha, Rana Daggubati, Rana Miheeka Marriage Photos Viral, Rana Miheeka Wedding, Rana Wedding, Ranamiheekawedding

టాలీవుడ్‌ స్టార్‌ రానా వివాహం అతి తక్కువ మంది గెస్ట్‌ల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది.ఈ వివాహ వేడుకకు పెద్దగా బంధు మిత్రులను ఆహ్వానించలేదు.

 Rana Miheeka Wedding Viral

అతి తక్కువ మంది మాత్రమే ఈ వివాహ వేడుకలో హాజరు అయ్యారు.టాలీవుడ్‌ నుండి అల్లు అర్జున్‌ ఈ వివాహ వేడుకలో పాల్గొన్నాడు.

ఇక రానా ఫ్యామిలీ మెంబర్‌ అయిన నాగచైతన్య సతీ సమంత సమేతంగా హాజరు అయ్యాడు.ఈ వివాహ వేడుకలో ప్రభాస్‌ పాల్గొన్నాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.

అంగరంగ వైభవంగా రానా మిహికాల వివాహం-Movie-Telugu Tollywood Photo Image

అల్లు అర్జున్‌ హాజరు అయినట్లుగా ఫొటోలు మాత్రం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి.

రానా గోధుమ వర్ణంలో లాల్చీ పంచె ధరించగా మిహికా బజాజ్‌ కూడా అదే రంగు డిజైన్డ్‌ సారీ ధరించారు.

ఇద్దరు కూడా అత్యంత ఖరీదైన వస్త్రాలను ధరించడంతో పాటు అత్యంత ఖరీదైన పెళ్లి వేదికపై వివాహం చేసుకున్నట్లుగా బయటకు వచ్చిన ఫొటోలను బట్టి అర్థం అవుతుంది.కుటుంబ సభ్యులు మరియు అతి తక్కువ మంది బంధు మిత్రుల సమక్షంలో సామాజిక దూరం పాటిస్తూ రానా వివాహం వైభవంగా జరిగింది.

ఇన్నాళ్లు టాలీవుడ్‌ మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ గా పేరున్న రానా ఇప్పుడు ఒక ఇంటి వాడు అయ్యాడు.ఈ సందర్బంగా నవదీప్‌ స్పందిస్తూ నీ జాలీ లైఫ్‌ కు ఇదే ఆకరి రోజు అంటూ కామెంట్‌ చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది.సరదాగా ఆయన ఆ కామెంట్‌ చేసి పెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు.మా తరపున కూడా రానా మిహికా బజాజ్‌ లకు హృదయపూర్వక వివాహ మహోత్సవ శుభాకాంక్షలు.

#Allu Arjun #Rana Daggubati #RanaMiheeka #NagaChaitanya #Rana Wedding

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rana Miheeka Wedding Viral Related Telugu News,Photos/Pics,Images..