యంగ్ హీరో రానా లగ్జరీ హౌస్ ను మీరు చూశారా..?

హీరోగా నటించింది తక్కువ సినిమాలే అయినా ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు రానా.కమర్షియల్ గా హిట్టయ్యే సినిమాల కంటే నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టే సినిమాలనే రానా ఎక్కువగా ఎంపిక చేసుకుంటూ ఉండటం గమనార్హం.

 Rana Luxurious Home Photo Goes Viral In Social Media-TeluguStop.com

ఒకవైపు తెలుగు సినిమాల్లో అడపాదడపా హిందీ సినిమాల్లో కూడా రానా నటిస్తున్నారు.బాహుబలి సిరీస్ సినిమాలు రానాకు పాన్ ఇండియా ఇమేజ్ ను తెచ్చిపెట్టాయి.

ప్రస్తుతం రానా అరణ్య, విరాటపర్వం అనే సినిమాల్లో నటిస్తుండగా కొద్ది నెలల గ్యాప్ లోనే ఈ రెండు సినిమాలు విడుదలవుతున్నాయి.ఇప్పటికే విడుదలైన విరాటపర్వం టీజర్ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.

 Rana Luxurious Home Photo Goes Viral In Social Media-యంగ్ హీరో రానా లగ్జరీ హౌస్ ను మీరు చూశారా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తెలుగు రాష్ట్రాల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సాయిపల్లవి ఈ సినిమాలో నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.ఇకపోతే రానా లగ్జరీ హౌస్ కు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

రానా చాలా సంవత్సరాల క్రితం నుంచే ఈ ఇంట్లో ఉంటున్నా అతని ఇంటికి సంబంధించిన ఫోటోలు గతంలో ఎప్పుడూ వైరల్ కాలేదు.ఈ ఇల్లు రానా సొంత ఇల్లు కాగా రామానాయుడు స్టూడియోస్ కు పరిసరాల్లోనేన్ ఈ ఇల్లు ఉండటం గమనార్హం.

తన టేస్ట్ కు తగిన విధంగా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి రానా ఈ ఇంటిని నిర్మించుకున్నారు.రానా తన ఇంట్లోనే విజువల్ ఎఫెక్ట్స్ కు సంబంధించిన స్టూడియోను కూడా ఏర్పాటు చేసుకున్నారు.

అయితే ఈ ఇంటి కోసం రానా ఎంత ఖర్చు చేశారనే సంగతి తెలియాల్సి ఉంది.ప్రస్తుతం రానా ఒక్కో సినిమాకు 5 కోట్ల రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

రానా నటించిన మరో రెండు సినిమాలు హిట్టైతే మాత్రం రానా రెమ్యునరేషన్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.

#Rana #Crores Rupees

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు