రవితేజ ఆ పని చేస్తే తప్పు లేదు.. రానా చేస్తే మాత్రం తప్పా?

మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.రవితేజ సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ ఆఫర్లు వస్తుండగా రవితేజ తర్వాత ప్రాజెక్ట్ లతో విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

 Rana Lip Lock Become Hot Topic In Social Media Details, Lip Lock, Rana, Rana Nai-TeluguStop.com

ధమాకా, టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర సినిమాలలో రవితేజ నటిస్తుండగా ఈ ప్రాజెక్ట్ లలో ధమాకా మూవీ మొదట విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

రవితేజ, శ్రీలీల ధమాకా సినిమాలో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో వీళ్లిద్దరి మధ్య లిప్ లాక్ సన్నివేశాలు ఉన్నాయి.రవితేజ యంగ్ హీరోయిన్ తో లిప్ లాక్ సీన్లు చేయడం గురించి కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేశారనే సంగతి తెలిసిందే.

అయితే రానా ప్రస్తుతం రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో నటిస్తుండగా ఇందులో రానా లిప్ లాక్ సన్నివేశంలో నటించడం గమనార్హం.

అయితే పెళ్లి తర్వాత రానా లిప్ లాక్ సీన్లలో నటించడం గురించి కొంతమంది విమర్శలు చేస్తుండగా రానా అభిమానులు ధీటుగా బదులిస్తున్నారు.

Telugu Dhamaka, Lip Lock, Rana, Rana Daggubati, Rana Lip Lock, Rana Web, Ravitej

రవితేజ లిప్ లాక్ సన్నివేశాల్లో నటిస్తే తప్పు లేదు కానీ రానా నటిస్తే మాత్రం తప్పైందా అని కామెంట్లు వినిపిస్తున్నాయి.కథ డిమాండ్ చేస్తే మాత్రమే రానా అలాంటి సన్నివేశాల్లో నటిస్తారని కొంతమంది చెబుతున్నారు.రానా నాయుడు వెబ్ సిరీస్ తో రానా సక్సెస్ సాధిస్తారో లేదో చూడాల్సి ఉంది.

Telugu Dhamaka, Lip Lock, Rana, Rana Daggubati, Rana Lip Lock, Rana Web, Ravitej

ఇప్పటికే విడుదలైన రానా నాయుడు టీజర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ కామెంట్లు వచ్చాయి.రానా నాయుడు వెబ్ సిరీస్ తో రానా కోరుకున్న సక్సెస్ దక్కుతుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.టీజర్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని కొంతమంది నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తూ ఉండటం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube