బన్నీ ఇచ్చిన సలహా ఎప్పటికీ మరిచిపోలేను : రానా

లీడర్ సినిమాతో తెలుగు తెరపై హీరోగా కెరీర్ ను మొదలుపెట్టిన రానా ఒకవైపు నటుడిగా అవకాశాలతో బిజీగా ఉంటూనే మరోవైపు బుల్లితెర షోలను కూడా హోస్ట్ చేస్తున్నారు.రానా హోస్ట్ చేసిన నంబర్ 1 యారీ సీజన్ 1, సీజన్ 2 సక్సెస్ కాగా ఆహా ఓటీటీలో మూడో సీజన్ ప్రసారం కానుంది.

 Rana Interesting Comments About  Bunny Advice,  Bunny Advice , Nenu Na Rakshasi-TeluguStop.com

ఈ షో లాంఛ్ ఈవెంట్ లో పాల్గొన్న రానా తన స్నేహితులలో ఒకరైన అల్లు అర్జున్గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

తనకు సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్, రామ్ చరణ్, బన్నీ, నాగచైతన్య మంచి ఫ్రెండ్స్ అని రామ్ చరణ్ తనకు బాల్య స్నేహితుడిని, లైఫ్ లో రామ్ చరణ్ కు ప్రత్యేక స్థానం ఉందని రానా చెప్పారు.

చరణ్ తన 3ఏఎం ఫ్రెండ్ అంటూ రానా ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.తనకు ఎటువంటి సహాయం అవసరమైనా మొదట చరణ్, అల్లు అర్జున్ లకు తన నుంచి ఫోన్ కాల్ వెళుతుందని రానా తెలిపారు.

Telugu Bunny, Puri Jagannath, Rana-Movie

హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన టైమ్ లో బన్నీ సలహా ఇచ్చాడని బన్నీ ఇచ్చిన సలహాను తాను ఎప్పటికీ మరిచిపోలేనని రానా అన్నారు.పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన నేను నా రాక్షసి సినిమా షూటింగ్ మొదలైన సమయంలో బన్నీ తనతో ఇక్కవడివరకు ఏవో స్కెచ్ లు వేసుకుంటూ వచ్చావని ఇకనుంచి మాత్రం స్కిల్ లేకపోతే పని జరగదని అన్నాడని ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.

మిహీకాను పెళ్లి చేసుకోవడం గురించి స్పందిస్తూ మొదట పేరెంట్స్ కు మిహీకతో పెళ్లి గురించి చెప్పానని ఆ తరువాత చైతన్యకు ఫోన్ చేసి మిహీకాను పెళ్లి చేసుకోబోతున్నట్టు చెప్పగా తాను లైఫ్ లో తీసుకున్న బెస్ట్ డిసిషన్ ఇదేనని చైతన్య అన్నాడని రానా వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube