చైతూతో సమంత పెళ్లికి ఆ హీరోనే కారణమా..?  

టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్ జాబితాలో చైతన్య, సమంత ముందు వరసలో ఉంటారు.చాలా సంవత్సరాల పాటు ఒకరినొకరు ప్రేమించుకున్న చైతన్య సమంత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.2017 సంవత్సరం అక్టోబర్ నెల 7వ తేదీన వీరి వివాహం జరిగింది.ఎప్పుడూ షూటింగ్ లతో, ఇతర పనులతో బిజీగా ఉండే సమంత వారం రోజులు మాల్దీవులకు వెకేషన్ కు వెళ్లి నిన్న తిరిగి వచ్చారు.

TeluguStop.com - Rana Helped Samantha Naga Chaitanya Marriage

చైతన్య పుట్టినరోజు సందర్భంగా మాల్దీవులకు వెళ్లిన సమంత అక్కడ చైతన్య పుట్టినరోజు వేడుకలు జరిపారు.

నాగచైతన్య పుట్టినరోజు ఫోటోలతో పాటు, సమంత హాట్ గా కనిపిస్తూ షేర్ చేసిన ఫోటోలు సైతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

TeluguStop.com - చైతూతో సమంత పెళ్లికి ఆ హీరోనే కారణమా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

సినిమాల్లో పద్ధతిగా ఉండే పాత్రలు ఎంచుకుంటున్న సమంత నిజ జీవితంలో మాత్రం గ్లామరస్ గా కనిపించడానికి ప్రాధాన్యతనిస్తున్నారు.అయితే చాలామంది చైతూ సమంత ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్నారని భావిస్తూ ఉంటారు.

ఇది నిజమే అయినా చైతూ సమంత పెళ్లి జరగడానికి ఒక హీరో కూడా కారణమని తెలుస్తోంది.

నాగచైతన్య వివాహమంటే అటు నాగార్జున ఫ్యామిలీతో పాటు ఇటు వెంకటేష్ ఫ్యామిలీని కూడా ఒప్పించాలి.రానా ఆ బాధ్యతను తీసుకుని ఇరు కుటుంబాలను ఒప్పించి సమంత, చైతన్యల వివాహం జరగడానికి పరోక్షంగా కారణమయ్యారు.సమంత హోస్ట్ చేస్తున్న సామ్ జామ్ టాక్ షోకు గత వారం రానా హాజరైన సంగతి తెలిసిందే.

ఆ షోలో భాగంగా సమంత మాట్లాడుతూ రానా లేకపోతే పెళ్లి జరిగేది కాదని అన్నారు.

సమంత మాటలను బట్టి పెళ్లి కోసం రానా ఎంత కష్టపడ్డాడో అర్థమవుతుంది.మరోవైపు సమంత, నాగచైతన్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.నాగచైతన్య లవ్ స్టోరీ, థ్యాంక్యూ సినిమాలలో నటిస్తుండగా సమంత సామ్ జామ్ షోను హోస్ట్ చేయడంతో పాటు వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు.

#Maldives #Sam Jam Show #Rana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rana Helped Samantha Naga Chaitanya Marriage Related Telugu News,Photos/Pics,Images..