రానా మెంటల్‌ స్ట్రెంత్‌ కు హ్యాట్సాఫ్‌  

యంగ్‌ హీరో రానా 2018లో తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నాడు.గత ఏడాదిలో రానా ఆరోగ్యం గురించి మీడియాలో ఓ రేంజ్‌ లో వార్తలు వచ్చాయి.

TeluguStop.com - Rana Health Issues Samantha Samjam Show

రానాకు కంటి ఆపరేషన్‌ అని.కిడ్నీ ఆపరేషన్‌ అని ఇంకా ఏదో ఏదో అంటూ మీడియాలో ప్రచారం జరిగింది.కాని ఆయన మాత్రం బయటకు చాలా హుషారుగా కనిపిస్తూ వచ్చాడు.ఆయన ఫొటోలు అప్పుడప్పుడు సోషల్‌ మీడియాలో కనిపించగా ఏం లేదేమో అనిపించింది.ఒకానొక సమయంలో సురేష్‌ బాబు మాట్లాడుతూ రానా ఆరోగ్య పరిస్థితి కాస్త బాగాలేదు.కాని త్వరలో అన్ని సర్దుకుంటాయని ఆశిస్తున్నాం అంటూ చెప్పుకొచ్చాడు.

అంతకు మించి రానా ఆరోగ్యం గురించి ఎలాంటి క్లూ లేదు.ఎట్టకేలకు రానా ఆరోగ్యం గురించి అంతా కూడా సామ్‌ జామ్‌ షో లో క్లారిటీ వచ్చేసింది.

TeluguStop.com - రానా మెంటల్‌ స్ట్రెంత్‌ కు హ్యాట్సాఫ్‌-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

దగ్గుబాటి ఫ్యామిలీకి బంధువే అయిన కారణంగా సమంతకు అన్ని విషయాలు ముందే తెలుసు.కనుక తన షో లో ఆ విషయాలను అన్నింటిని కూడా రానాతో చెప్పించింది.

2018లో జమ్మూ కశ్మీర్‌ కు ఫ్యామిలీ అంతా కూడా జాలీ ట్రిప్‌ వెళ్లాం.అక్కడ నుండి రాగానే రానా అరణ్య షూటింగ్‌ లో జాయిన్‌ అవ్వాల్సి ఉంది.ఆ సమయంలో కంటికి సంబంధించి చిన్న ఆపరేషన్‌ కు రెడీ అయ్యాను.అప్పుడు వారు రానా బీపీ చెక్‌ చేశారు.వారికి డౌట్‌ వచ్చింది.ఆ తర్వాత మరో ఆసుపత్రికి వెళ్లి చాలా టెస్టులు చేయించారు.

అక్కడ బీపీ ఉండవల్సినదాని కంటే డబుల్‌ ఉంది.అంత బీపీతో ఎలా ఉంటున్నారు అంటూ అంతా షాక్‌ అయ్యారు.

ఆ సమయంలో రానా కుటుంబ సభ్యులం మొత్తం కూడా సైలెంట్‌ గా ఏడ్చేస్తున్నాం .కాని రానా మాత్రం ఏం లేదు అంతా బాగానే ఉందంటూ చిల్ చేసే ప్రయత్నం చేశాడు అంటూ అప్పటి జ్ఞాపకాలను సమంత నెమరవేసుకుంది.అందరు ఎంతో టెన్షన్‌ పడుతున్నా కూడా రానా మాత్రం చాలా ధైర్యంగా ఏం అయ్యింది.నాకు అయితే అంతా బాగానే అనిపిస్తుంది అంటూ వచ్చాడు.ఆయన మెంటల్‌ స్ట్రెంత్‌ వల్లే ఈ స్థాయిలో ఆయన ఆరోగ్యం మళ్లీ కుదుట పడి ఉంటుందని సమంత చెప్పుకొచ్చింది.అంత పెద్ద సమస్య అన్నప్పుడు ఎవరైనా టెన్షన్‌ పడతారు.

కాని రానా మాత్రం ట్రీట్‌మెంట్‌ తీసుకుంటూనే అమెరికాలో సినిమాలు సైతం చూసేవాడట.మొత్తానికి రానా చాలా మానసికంగా బలవంతుడు అంటూ ఆయన పరిస్థితిని బట్టి అర్థం చేసుకోవచ్చు.

#Rana Daggubati #@harshachemudu #Aha OTT #Samantha #Rana Health

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు