టాలీవుడ్ ఇండస్ట్రీలో దగ్గుబాటి హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో రానా( Rana ) ఒకరు.ఇదేనా హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో విభిన్నమైన కథ చిత్రాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
కథ నచ్చితే తాను విలన్ పాత్రలలో నటించడానికి కూడా వెనకాడను అంటూ రానా పలు సందర్భాలలో తెలియజేశారు.ఈ క్రమంలోనే బాహుబలి సినిమాలో భళ్ళాల దేవుడి పాత్రలో నటించి మెప్పించారు.
ఇక భీమ్లా నాయక్ ( Bheemla Nayak )సినిమాలో కూడా నెగిటివ్ పాత్రలో ఈయన ఎంతో అద్భుతంగా నటించారని చెప్పాలి.

ఈ విధంగా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి రానా ఇటీవల తన బాబాయ్ వెంకటేష్ తో కలిసి రానా నాయుడు( Rana Naidu ) అనే వెబ్ సిరీస్ చేసిన సంగతి మనకు తెలిసిందే.ఇకపోతే తాజాగా రానా ఒక క్రేజీ బయోపిక్ సినిమా చేయడానికి సిద్ధమయ్యారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి మరి ఈయన చేయబోయే ఆ బయోపిక్ సినిమా ఎవరిది ఏంటి అనే విషయానికి వస్తే…

బాక్సింగ్ లెజెండ్ ముహమ్మద్ అలీ ( Mohammad Ali ) బయోపిక్‌లో రానా నటించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.అయితే దీన్ని ఇండియన్ వెర్షన్‌గా రూపొందించాలని రానా భావిస్తున్నట్టు సమాచారం.ఇక ఈ విషయం గురించి ఈయన ఇప్పటికే పలువురు డైరెక్టర్లను కలిసి సంప్రదింపులు కూడా చేశారని తెలుస్తుంది.బాక్సర్ ముహమ్మద్ జీవితాన్ని చాలా ఎమోషనల్‌గా తెరపై చూపించే అవకాశం ఉందని అందుకే ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ బయోపిక్ చేయాలని రానా డిసైడ్ అయ్యారట.
ఈయన గురించి ఇప్పటివరకు హాలీవుడ్ సినిమాలు వచ్చాయి కానీ తెలుగులో రావడం ఇదే తొలిసారి అవుతుంది.మరి ఈ క్రేజీ బయోపిక్ సినిమాని రానా ఎవరి డైరెక్షన్లో చేయబోతున్నారు ఏంటి అనే విషయాలు తెలియాల్సి ఉంది.