వైరల్ ఫోటో: అత్తారింట సందడి చేస్తున్న కొత్త అల్లుడు..  

Dasara Celebrations, Miheeka Bajaj, Miheeka’s parents’, Pic Talk: Rana And Miheeka’s First Dussehra Celebrations, Rana Daggubati - Telugu Dasara Celebrations, Dasara Festival, Hero Rana, Miheeka Bajaj, Miheeka’s Parents’, Mihika Bajaj, Pic Talk: Rana And Miheeka\\'s First Dussehra Celebrations, Rana Daggubati, Tollywood

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కొనసాగిన ద‌గ్గుబాటి రానా తాజాగా లాక్ డౌన్ సమయంలో తన ప్రియురాలు మిహీకా బజాజ్‌ ను ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు.కొద్దిపాటి బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నాడు.

TeluguStop.com - Rana Daggupati Miheeka Bajaj Family Dasara Celebrations

రానా తన ప్రేమ విషయాన్ని సోషల్ మీడియాలో తెలపడం ఆ తర్వాత వెంట వెంటనే ఎంగేజ్మెంట్, ఆ తర్వాత పెళ్లి ఇలా అన్నీ చకచకా జరిగిపోయాయి.

ఇకపోతే తాజాగా రానా దసరా పండగ సందర్భంగా తన అత్తగారింట్లో తన భార్యతో కలిసి పండగను జరుపుకున్నారు.

TeluguStop.com - వైరల్ ఫోటో: అత్తారింట సందడి చేస్తున్న కొత్త అల్లుడు..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇందుకు సంబంధించి ఫోటోలను తాజాగా రానా దగ్గుబాటి అత్తగారు బంటి బజాజ్ ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు.ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ ఫోటోలను చూస్తుంటే రానా దగ్గుబాటి కొత్త అల్లుడిగా అత్తారింట సందడి చేసినట్లు అర్థమవుతుంది.అత్తమామలు భార్యతో కలిసి దసరా పండుగను బాగా ఎంజాయ్ చేసినట్లు ఫోటోలు చూస్తే అర్థమవుతుంది.

ప్రత్యేక పూజల అనంతరం రానా తన అత్తమామలతో సతీమణి మిహీకా బజాజ్ తో కలిసి ఫ్యామిలీ ఫోటోలు దిగారు.ఆగస్టు ఎనిమిదిన దగ్గుబాటి రానా, మిహీకా బజాజ్ ల వివాహం జరిగిన సంగతి తెలిసిందే.
ఇది ఇలా ఉండగా హీరో రానా టైటిల్ రోల్ లో నటిస్తున్న చిత్రం అరణ్య.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులు పూర్తి అవగా ఈ సినిమాను 2021 సంక్రాంతి కి విడుదల చేయబోతోంది చిత్ర బృందం.

ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలోనే విడుదల చేయాల్సి ఉండగా ఈ సినిమాను కరోనా వైరస్ నేపథ్యంలో దాదాపు 8 నెలలు ఈ సినిమాని వాయిదా వేస్తూ వస్తున్నారు.ఈ సినిమా అస్సాం రాష్ట్రంలో జరిగిన ఓ నిజమైన సంఘటన నేపథ్యంలో తెరకెక్కింది.

View this post on Instagram

Happy Dussehra @ranadaggubati @miheeka

A post shared by Bunty Bajaj (@buntybajaj) on

#Rana Daggubati #Dasara Festival #Hero Rana #Mihika Bajaj #Miheeka Bajaj

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rana Daggupati Miheeka Bajaj Family Dasara Celebrations Related Telugu News,Photos/Pics,Images..