హీరోగా రానా త‌మ్ముడు సినిమా ఫిక్స్.. శ్రీరెడ్డి రియాక్షన్ ఏంటో?

సినీ ఇండస్ట్రీలో ఎప్పటినుండో వారసత్వాలకే ఎక్కువ అవకాశాలు ఇస్తుంటారు.ముందు వారసత్వం తర్వాతే బయటి వాళ్ళను అతి తక్కువగా తీసుకుంటారు.

 Rana Daggubati Brother Abhiram Entry Movie With Director Teja , Rana Daggubati,-TeluguStop.com

ఇక ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు అలాగే పరిచయమయ్యారు.ఇక తాజాగా మరో స్టార్ హీరో తమ్ముడు హీరోగా పరిచయం కానున్నాడు.

టాలీవుడ్ స్టార్ హీరో దగ్గుబాటి రానా పరిచయం గురించి అందరికీ తెలిసిందే.ఇక ఇప్పటికే దగ్గుబాటి ఫ్యామిలీ నుండి ఎంతో మంది హీరోలు సినీ పరిశ్రమకు పరిచయం అవ్వగా.

తాజాగా రానా తమ్ముడు అభిరామ్ కూడా హీరోగా కనిపించనున్నాడు.అంతేకాకుండా ఓ డైరెక్టర్ తో సినిమా కూడా పిక్స్ చేశారట.

ఇప్పటికే పలువురు దర్శకులతో చర్చించిన అవి వర్కవుట్ కాలేక డైరెక్టర్ తేజ తో మొత్తానికి కుదిరిందట.

Telugu Abhiram, Teja, Rana Daggubati, Rp Patnaik, Sri Reddy, Suresh Babu-Movie

డైరెక్టర్ తేజ దర్శకత్వంలో నేనే రాజు నేనే మంత్రి సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో అభిరామ్ కూడా ఈ డైరెక్టర్ దర్శకత్వంలో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని అనుకుంటున్నారట.ఇక ఈ సినిమాకు ఆర్ పి పట్నాయక్ సంగీతాన్ని అందిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదంతా ఇలా ఉంటే అభిరామ్ సినిమా విషయంలో శ్రీ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

గతంలో శ్రీ రెడ్డి క్యాస్టింగ్ కౌచ్ విషయంలో ఈమె చేసిన ఆరోపణలు అంతా ఇంతా కాదు.

సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్లను దడ పుట్టించింది.అంతేకాకుండా ఓ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీ రెడ్డి రానా తమ్ముడు అభిరామ్ గురించి కొన్ని విషయాలను బయటపెట్టింది.

అంతేకాకుండా వారిద్దరు సన్నిహితంగా కలిసి దిగిన ఫోటోలను కూడా మీడియాకు పంచుకుంది.అంతేకాకుండా తనను అభిరామ్ వాడుకున్నాడని, అతడి వల్ల ఎంతోమంది అమ్మాయిలు నాశనం అయ్యారని ఎన్నో విషయాలను బయటపెట్టింది.

ఇక ప్రస్తుతం అభిరామ్ హీరోగా వస్తున్నాడంటే మళ్లీ శ్రీ రెడ్డి ఎలాంటి విషయాలు బయట పెడుతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube