సైనికులపై రానా డాక్యుమెంటరీ మిషన్ ఫ్రంట్ లైన్  

Rana Daggubati turns BSF jawan for Mission Frontline, Tollywood, Bollywood, Discovery ,dacumantry,rana,social media,front line,border security,social avare - Telugu Bollywood, Bsf Jawan, Discovery, Mission Frontline, Rana Daggubati, Tollywood

ఇండియన్ వైడ్ యాక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న నటుడు రానా దగ్గుబాటి.ఓ వైపు విభిన్న కథలతో సినిమాలు చేస్తూ విలక్షణ నటుడుగా గుర్తింపు తెచ్చుకునే దిశగా రానా అడుగులు వేస్తున్నాడు.

TeluguStop.com - Rana Daggubati Turns Bsf Jawan For Mission Frontline

గత ఏడాది ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసిన రానా వెంటనే మళ్ళీ విరాటపర్వం షూటింగ్ లో జాయిన్ అయిపోయాడు.ఇప్పుడు అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ షూటింగ్ కోసం ఎదురుచూస్తున్నాడు.

ఇదిలా ఉంటే మరో వైపు రానా ఎవరికీ తెలియకుండా ఓ డాక్యుమెంటరీ కూసే తెరకెక్కించాడు.సరిహద్దు భద్రతా దళాలతో కలిసి సైనికులపై వీడియో రూపొందించినట్లు రానా తన సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చే వరకు ఈ విషయం ఎవరికీ తెలియకపోవడం విశేషం.

TeluguStop.com - సైనికులపై రానా డాక్యుమెంటరీ మిషన్ ఫ్రంట్ లైన్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

బోర్డర్‌ ఫోర్సెస్‌ మీద డిస్కవరీ ప్లస్‌తో కలిసి మిషన్‌ ఫ్రంట్‌ లైన్‌ పేరుతో ఓ డాక్యుమెంటరీ రూపొందించారు.ఈ డాక్యుమెంటరీ జనవరి 21 హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది.

ఈ డాక్యుమెంటరీ రూపొందించిన రానా డిస్కవరీ ప్లస్‌ వారికి, బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్సెస్‌కు సోషల్ మీడియా ద్వారా ధన్యవాదాలు తెలిపారు.జీవితంలో ఒకే ఒకసారి దొరికే అద్భుతమైన అనుభావాన్ని నాకు కల్పించారు.

మిషన్‌ ఫ్రంట్‌లైన్‌ పేరుతో ఈ డాక్యుమెంటరీని రూపొందించారు. జనవరి 21న ఈ డాక్యుమెంటరీ ప్రసారం కానుంది అని ట్వీట్‌ చేశారు.

సరిహద్దు దళాలు ఎంతో కష్టపడి శత్రువుల బారి నుండి మనల్ని కాపాడటానికి కష్టపడుతుంటారు.వారి ప్రాణాలను సైతం పోగొట్టుకుంటూ ఉంటారు.

అలాంటి వారిపై డాక్యుమెంటరీ చేయడం ద్వారా చాలా గొప్ప విషయాన్ని ప్రజలకి రానా తెలియజేసే ప్రయత్నం చేశారని చెప్పాలి. సోషల్ అవేర్ నెస్ విషయంలో ఎప్పుడూ ముందు ఉండే రానా ఈ సారి సైనికులకు తీసిన డాక్యుమెంటరీలో ఏం చూపించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.
.

#Discovery #BSF Jawan #Rana Daggubati

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు