ఆర్ఆర్ఆర్‌లో రానా రాజకీయం!

దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ తెలుగు ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు.

 Rana Daggubati To Do Politics In Teja Rrr-TeluguStop.com

ఇండియన్ బాక్సాఫీస్‌ను ఈ సినిమా ఎలా షేక్ చేస్తుందా అని లెక్కలు వేస్తున్నారు.అయితే ఆర్ఆర్ఆర్ అనగానే రాజమౌళి చిత్రంతో పాటు ఇప్పుడు మరో సినిమా పేరు తెచ్చుకుంది.

అదే దర్శకుడు తేజ తెరకెక్కిస్తున్న ‘రావణ రాక్షస రాజ్యం’.

బాహుబలి నటుడు రానా దగ్గుబాటితో తేజ గతంలో నేనే రాజు నేనే మంత్రి అనే సినిమాను తీసి అదిరిపోయే సక్సెస్ అందుకున్నాడు.

ఇప్పుడు మరోసారి రానాతో కలిసి మరో పొలిటికల్ థ్రిల్లర్‌ను తెరకెక్కించేందుకు తేజ రెడీ అవుతున్నాడు.దీనికి సంబంధించి చిత్ర టైటిల్‌ను తేజ ఇటీవల ఆయన పుట్టినరోజు సందర్భంగా అనౌన్స్ చేశాడు.

అయితే ఈ సినిమాలో రానా మరోసారి పవర్‌ఫుల్ పొలిటికల్ లీడర్‌గా రాజకీయం చేయనున్నాడట.

మొత్తానికి ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఉన్న క్రేజ్‌ను తనదైన స్టైల్‌లో క్యాష్ చేసుకోవాలని తేజ వేసిన ప్లాన్‌కు అందరూ ఫిదా అయ్యారు.

ఇక ఈ సినిమాను వీలైనంత త్వరగా సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు తేజ రెడీ అవుతున్నాడు.మరి ఆర్ఆర్ఆర్‌లో రానా రాజకీయం ఎలా ఉంటుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube