డబ్బింగ్ మొదలుపెట్టిన విరాటపర్వం  

టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విరాటపర్వం’ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను దర్శకుడు వేణు ఉడుగుల డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

TeluguStop.com - Rana Daggubati Starts Dubbing For Virataparvam

ఇక ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ అయిన పోస్టర్స్ ఈ సినిమాపై ఉన్న అంచనాలను పెంచుతూ వచ్చాయి.కాగా తాజాగా సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా అప్‌డేట్‌ను హీరో రానా దగ్గుబాటి తన అభిమానులతో పంచుకున్నాడు.

విరాటపర్వం చిత్ర షూటింగ్ ఇప్పటికే ముగిసిందని, తాజాగా ఈ సినిమా డబ్బింగ్ పనులు మొదలైనట్లు రానా చెప్పుకొచ్చాడు.తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్‌ను రానా ప్రారంభించినట్లు ఓ స్టిల్‌ను పంచుకున్నాడు.

TeluguStop.com - డబ్బింగ్ మొదలుపెట్టిన విరాటపర్వం-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

పీరియాడికల్ మూవీగా వస్తున్న విరాటపర్వం చిత్రంలో రానా ఓ నక్సలైట్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో ఆయన సరసన హీరోయిన్‌గా అందాల భామ సాయి పల్లవి నటిస్తోంది.

వీరిద్దరికి సంబంధించిన పోస్టర్‌ను కూడా చిత్ర యూనిట్ సంక్రాంతి కానుకగా రిలీజ్ చేశారు.

ఇక ఈ సినిమాలో రానా యాక్టింగ్ మరో లెవెల్‌లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

అటు సాయి పల్లవి కూడా తన యాక్టింగ్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ సినిమాలో నందితా దాస్, ప్రియమణి వంటి యాక్టర్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సురేష్ బాబు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాతో రానా మరోసారి అదిరిపోయే హిట్ అందుకునేందుకు రెడీ అవుతున్నాడు.ఈ సినిమాలో రానా యాక్టింగ్‌కు ప్రేక్షకులు మెస్మరైజ్ కావడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది.

మరి విరాటపర్వం చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

#Virataparvam #Rana Daggubati #Sai Pallavi #Venu Udugula #Dubbing

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు