కొత్త టాలెంట్ వారి కోసం సరికొత్త నిర్ణయం తీసుకున్న రానా..!!  

కొత్త టాలెంట్ కలిగిన యువ డైరెక్టర్లకు అవకాశం ఇస్తానని బహిరంగంగానే దగ్గుబాటి రానా అప్పట్లో ప్రకటించడం తెలిసిందే.ఇప్పుడు ఈ తరహాలోనే వారికి అవకాశం కల్పించే రీతిలో సరికొత్త వేదిక రెడీ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి.

TeluguStop.com - Rana Daggubati South Bay Youtube Channel

ఇదే విషయాన్ని తాజాగా `సౌత్ బే` ప్రమోషన్ లో రానా వ్యాఖ్యానించారు.
మేటర్ లోకి వెళితే రానా యూట్యూబ్ లో `సౌత్ బే` పేరుతో గత ఏడాది ఛానల్ స్టార్ట్ చేయడం అందరికీ తెలిసిందే.

ఈ ఛానల్ ద్వారా ఇప్పటికే ఇండస్ట్రీలో ఉండే చాలా మంది సెలబ్రిటీలతో ఇంటర్వ్యూలు చేస్తూ అనేక అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు.ఈ క్రమంలో సంగీత ప్రపంచంలో కొత్త దారి కోసం వెతుకుతున్న కొత్త టాలెంట్ కలిగినవారిని ఇండస్ట్రీలో ఇంట్రడ్యూస్ చేయడానికి రానా ప్రయత్నిస్తున్నట్లు టాక్  వినిపిస్తోంది.

TeluguStop.com - కొత్త టాలెంట్ వారి కోసం సరికొత్త నిర్ణయం తీసుకున్న రానా..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇందుకోసం రానా ప్రఖ్యాత మ్యూజిక్ లేబుల్ తో ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రయత్నాలు స్టార్ట్ చేస్తున్నట్లు వార్తలు వైరల్ అవ్వుతున్నాయి. 
ఒక సంగీతం మాత్రమే కాక రచన అదేవిధంగా దర్శకత్వం, యానిమేషన్ ఇలా పలు విభాగాల్లో ప్రతిభావంతులు అదేవిధంగా ఇండస్ట్రీలో రాణించాలని అనుకుంటున్న వారి కోసం రానా సొంత యూట్యూబ్ ఛానల్ `సౌత్ బే` ద్వారా వారి టాలెంట్ బయట ప్రపంచానికి చూపించడానికి రెడీ అయినట్లు ఇండస్ట్రీ లో టాక్ నడుస్తుంది.

ఈవిధంగా నేరుగా ప్రముఖ డైరెక్టర్ల దృష్టిలో వారు పడే అవకాశం ఉండటంతో.ఈ వార్త తెలుసుకుని రానా యొక్క ఐడియా పట్ల చాలామంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాకుండా కొత్త టాలెంట్ కలిగినవారిని దర్శకత్వంలో వెబ్ సిరీస్ లో కూడా రానా నటించడానికి ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.క్రైసిస్ టైమ్ లో చాలావరకు తెలుగు కంటెంట్ మారడంతోపాటు ఓటీటీ హవా పెరగటంతో రానా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫిలిం వర్గాలలో టాక్ నడుస్తోంది.

#New Talent #South Bay #Rana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు