జెమినీ టీవీ డబుల్ డోస్.. తారక్ తో పాటు రానా..!

తెలుగులోని ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ లో ఒకటైన జెమినీ టీవీలో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా మీలో ఎవరు కోటీశ్వరుడు షో ప్రసారం కానుందంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.బిగ్ బాస్ సీజన్ 1ను హోస్ట్ చేసి సీజన్ 1 సక్సెస్ కు కారణమైన ఎన్టీఆర్ మీలో ఎవరు కోటీశ్వరుడు షోను కూడా సక్సెస్ చేస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

 Rana Daggubati Shoots No 1 Yaari Season 3 Teaser-TeluguStop.com

అయితే జెమిని టీవీలో ఎన్టీఆర్ తో పాటు రానా కూడా సందడి చేయనున్నారని తెలుస్తోంది.

గతంలో నంబర్ 1 యారి అనే ప్రోగ్రామ్ కు హోస్ట్ గా వ్యవహరించిన రానా ఈ ప్రోగ్రామ్ మూడవ సీజన్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారని తెలుస్తోంది.

 Rana Daggubati Shoots No 1 Yaari Season 3 Teaser-జెమినీ టీవీ డబుల్ డోస్.. తారక్ తో పాటు రానా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎన్టీఆర్, రానా వేర్వేరుగా ఒకే ఛానల్ లో రెండు ప్రోగ్రామ్స్ తో సందడి చేయనున్నారు. ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న షో పేరు ఎవరు మీలో కోటీశ్వరుడు అని మే నెల ఫస్ట్ వీక్ నుంచి ఈ షో ప్రసారం కానుందని మొత్తం 60 ఎపిసోడ్ లు ఉంటాయని తెలుస్తోంది.

Telugu No 1 Yaari, Rana, Rana Daggubati, Season 3-Movie

రానా, ఎన్టీఆర్ షోల వల్ల జెమినీ టీవీ ఇతర ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ కు మరింత గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తున్నట్టు భావిస్తున్నట్టు తెలుస్తోంది.ఇద్దరు స్టార్ హీరోలు సందడి చేస్తే ప్రేక్షకులకు డబుల్ డోస్ ఎంటర్టైన్మెంట్ అందుతుందని చెప్పవచ్చు.ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ తో బిజీగా ఉన్న తారక్ మే నెల నుంచి త్రివిక్రమ్ మూవీ షూటింగ్ లో కూడా పాల్గొనబోతున్నారని సమాచారం.

రానా హోస్ట్ చేసిన నెంబర్ 1 యారి రెండు సీజన్లు హిట్ అయ్యాయి.

ప్రస్తుతం రానా అరణ్య, విరాటపర్వం సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్నారు.ఈ ఏడాదే ఈ రెండు సినిమాలు విడుదల కానున్నాయి.రేటింగ్స్ పరంగా వెనుకబడ్డ జెమినీ టీవీ ఎన్టీఆర్, రానా షోల ద్వారా నంబర్ 1 లేదా నంబర్ 2 స్థానాన్ని కైవశం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది.

#Season 3 #No 1 Yaari #Rana Daggubati #Rana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు