దేవసేనకు గిఫ్ట్ పంపిన భళ్లాలదేవుడు.. ఏం జరిగిందంటే..?

యంగ్ హీరో రానా బాహుబలి సిరీస్ సినిమాల తర్వాత నటించిన అరణ్య మూవీ నేడు విడుదలైన సంగతి తెలిసిందే.సినిమా కథ బాగానే ఉన్నా కథనంలోని లోపాల వల్ల ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రాలేదు.

 Rana Daggubati Sends Gift To Anushka Shetty, Anushka Shetty ,aranya Movie, Rana-TeluguStop.com

క్రిటిక్స్ నుంచి కూడా ఈ సినిమాకు నెగిటివ్ రివ్యూలు రావడం గమనార్హం.బాహుబలికి మించి అరణ్య సినిమా కోసం శ్రమించిన రానాకు ఆ కష్టానికి తగిన ఫలితం మాత్రం దక్కకపోవడం గమనార్హం.

అరణ్య సినిమా ప్రమోషన్స్ లో భాగంగా టాలీవుడ్ ప్రముఖ సెలబ్రిటీలకు రానా బహుమతులు పంపారు.బాహుబలి సిరీస్ సినిమాలలో అనుష్క, రానా కలిసి నటించిన సంగతి తెలిసిందే.

అనుష్క ఆ సినిమాలో దేవసేన పాత్ర పోషించగా రానా భళ్లాలదేవుడి పాత్రలో నటించి తన నటనతో మెప్పించారు.ఉపాసన, సమంతలకు కూడా రానా బహుమతులను పంపగా అనుష్క తనకు పంపిన బహుమతిని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

అయితే రానా ఏం గిఫ్ట్ ఇచ్చారో స్పష్టత లేదు.

అనుష్క ఆ బహుమతిని చూసి రానా దగ్గుబాటికి థ్యాంక్స్ చెప్పడంతో పాటు పాటు అరణ్య సినిమాకు ఆల్ ది బెస్ట్ చెప్పారుమరోవైపు అనుష్క నిశ్శబ్దం ఫ్లాప్ తరువాత కొన్ని నెలల పాటు రెస్ట్ తీసుకుంటున్నారు.బరువు తగ్గడానికే అనుష్క గ్యాప్ తీసుకున్నారని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.యూవీక్రియేషన్స్ లో అనుష్క ఒక సినిమా చేస్తుండగా త్వరలో ఆ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ సినిమాలో అనుష్కతో పాటు నవీన్ పోలిశెట్టి కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.అనుష్క, నవీన్ కలిసి నటించబోతున్న ఈ సినిమా లవ్ స్టోరీ అని ప్రచారం జరుగుతుండగా ఈ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube