పవన్ సినిమా నుండి రానా ఔట్.. అందుకేనా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘వకీల్ సాబ్’ ఇప్పటికే చివరిదశ షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమా రిలీజ్ కాకముందే పవన్ తన నెక్ట్స్ చిత్రాలు వరుసబెట్టి ఓకే చేస్తూ దూసుకుపోతున్నాడు.

 Rana Daggubati Out Of Pawan Kalyan Movie, Rana Daggubati, Pawan Kalyan, Ayyappun-TeluguStop.com

ఇప్పటికే దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో తన నెక్ట్స్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అయిన పవన్, ఆ తరువాత దర్శకుడు హరీష్ శంకర్‌తో మరో సినిమా చేయనున్నాడు.ఇక ఎప్పటినుండో టాలీవుడ్‌లో చర్చ జరుగుతున్న మలయాళ చిత్రం ‘అయ్యప్పనమ్ కొషియమ్’ తెలుగు రీమేక్‌లోనూ పవన్ నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ కన్ఫం చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమాలో పవన్‌తో పాటు మరో హీరో ఉండబోతున్నాడు.మలయాళంలో బిజు మీనన్, పృథ్వీరాజ్ కలిసి నటించిన అయ్యప్పనమ్ కొషియమ్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ మూవీగా నిలిచింది.

అయితే ఈ సినిమాలో పవన్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తాడని చిత్ర యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసింది.కాగా రెండో హీరోగా ఈ సినిమాలో చాలా మంది పేర్లు వినిపించినా చివరకు రానా నటిస్తాడనే టాక్ ఫిలింనగర్ వర్గాల్లో జోరుగా వినిపించింది.

కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నుండి రానా వాకౌట్ చేసినట్లు తెలుస్తోంది.ఈ సినిమాలో పవన్ పాత్రను మరింత పవర్‌ఫుల్‌గా చూపించే క్రమంలో రానా పాత్రకు సంబంధించిన ప్రాముఖ్యత, నిడివి తగ్గించినట్లు తెలుస్తోంది.

దీంతో రానా ఈ సినిమా నుండి వాకౌట్ చేశాడనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.అయితే సోమవారం ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఉంటుందని చిత్ర యూనిట్ ప్రకటించింది.

మరి ఈ సినిమా నుండి రానా నిజంగానే వాకౌట్ చేశాడా? ఒకవేళ రానా ఈ సినిమా నుండి వాకౌట్ చేస్తే, అతడి స్థానంలో చిత్ర యూనిట్ మరెవరిని తీసుకుంది? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే మరికొంతసేపు వెయిట్ చేయాల్సిందే.ఇక ఈ సినిమాను సాగర్ కె.చంద్ర డైరెక్ట్ చేస్తుండగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తోంది.థమన్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube