14 రీల్స్ లో రానా నెక్స్ట్ మూవీ... ఈ సారి కమర్షియల్ స్టొరీతో

టాలీవుడ్ లో విభిన్న చిత్రాలతో నటుడుగా కెరియర్ ని బిల్డ్ చేసుకుంటున్న టాలెంటెడ్ యాక్టర్ అంటే రానా దగ్గుబాటి అని ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు.కెరియర్ ఆరంభించినప్పటి నుంచి ఆయన చేసిన సినిమాలు చాలా వరకు కమర్షియల్ జోనర్ కి దూరంగా ఉన్నవే కావడం గమనార్హం.

 Rana Daggubati Next Movie With 14 Reels, Viratparvam Movie, Aranya Movie, Tollyw-TeluguStop.com

అప్పుడెప్పుడో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నేను నా రాక్షసి అనే సినిమా కమర్షియల్ జోనర్ లో చేశాడు.అయితే అది కాస్తా డిజాస్టర్ అయ్యింది.

తరువాత ఎక్కువగా కంటెంట్ బేస్ కథలనే రానా నమ్ముకుంటూ సినిమాలు చేస్తూ హిట్స్ కొడుతున్నాడు.కేవలం తెలుగుకి మాత్రమే పరిమితం కాకుండా ఇతర బాషలలో కూడా సినిమాలు చేస్తూ ఇండియన్ వైడ్ యాక్టర్ గా గుర్తింపు పొందాడు.

బాహుబాలి సినిమాతో తన బ్రాండ్ ఇమేజ్ ని కూడా రానా పెంచుకున్నాడు.ప్రస్తుతం అరణ్య సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు.

అడవులలో ఏనుగుల సంరక్షణ నేపధ్యంలో ఈ సినిమా కథాంశం ఉంటుంది.ఇందులో జంతువుల బాషని అర్ధం చేసుకొని వాటి రక్షణ కోసం పోరాటం చేసే వ్యక్తిగా రానా పాత్ర ఉంటుంది.

ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది.దీంతో పాటు వేణు ఊడుగుల దర్శకత్వంలో చేసిన విరాటపర్వం సినిమా కూడా ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతుంది.

ఇందులో నక్సలైట్ నాయకుడుగా రానా కనిపించబోతున్నాడు.ఇదిలా ఉంటే 14 రీల్స్ బ్యానర్ లో రానా నెక్స్ట్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

అయితే ఈ సారి కంటెంట్ బేస్ కథ కాకుండా పక్కా కమర్షియల్ ఫార్ములా హీరోయిక్ స్టొరీకి రానా ఒకే చెప్పాడు.ఈ సినిమాతో ఓ కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడు.

కమర్షియల్ స్టొరీ అయినా కూడా బలమైన కంటెంట్ కూడా సినిమా ఉంటుందని టాక్ వినిపిస్తుంది.త్వరలో ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube