రానా షాప్ లో పుట్టగొడుగులు 5 లక్షలు.. చెరకు రసం 275.. ఇంత రేటుకు కారణాలివే!

మామూలుగా సినిమా ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు కేవలం సినిమాలు తీయడం మాత్రమే కాకుండా సినిమాలలో వచ్చే డబ్బులను బిజినెస్ రంగంలో పెట్టుబడిగా పెడుతూ ఉంటారు.

ఇప్పుడు ఒకే విషయంఫై ఆధారపడకుండా సైడ్ బిజినెస్ లు కూడా చేస్తూ ఉంటారు.

అలాగే అప్పుడప్పుడు సెలబ్రిటీలు పలు కమర్షియల్ యాడ్స్ కూడా చేస్తూ ఉంటారు.ఆ సంగతి పక్కన పెడితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీలు బిజినెస్ సంఘంలో రాణిస్తున్న విషయం తెలిసిందే.

వారిలో రానా దగ్గుబాటి( Rana Daggubati ) కూడా ఒకరు.రానా దంపతులు హైదరాబాద్‌ లోని బంజారాహిల్స్‌లో ఫుడ్‌ స్టోరీస్‌( Food Stories ) అనే షాప్‌ ను జనవరిలో ప్రారంభించారు.

ఇక్కడ కిరాణా సరుకులతో పాటు కూరగాయలు, పండ్లు, మాంసం, దుస్తులు, షూలు, బ్యాగ్స్‌, హెల్త్‌ కేర్‌ ప్రొడక్ట్స్‌ ఇలా అన్నీ దొరుకుతాయి.అయితే అన్నీ ప్రీమియం సరుకులే ఉంటాయి.బయట ఎక్కడా దొరకని అంతర్జాతీయ ఐటంస్‌ ఈ చోట లభించడం విశేషం.

Advertisement

ఈ ఫుడ్‌ స్టోరీస్‌లో స్మూతీస్‌, జ్యూస్‌, కాఫీ, చాక్లెట్స్‌, నూడుల్స్‌ ఇలా ఎన్నో ఉన్నాయి.క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి వంటి ప్రముఖులు ఉపయోగించే వాటర్‌ బాటిల్స్‌ కూడా ఉన్నాయి.

విదేశాల్లో మాత్రమే దొరికే ప్రత్యేక చీజ్‌లు, డ్రై ఫ్రూట్స్‌ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.దాదాపు ఆరు కిలోల మష్రూమ్‌ ఈ ఫుడ్‌ స్టోరీస్‌ లో ఉంది.దీని విలువ ఏకంగా రూ.5 లక్షలు.

మామూలు పుట్ట గొడుగులు( Mushrooms ) 100 గ్రాముల ధర రూ.175 నుంచి వెయ్యి రూపాయలపైనే ఉంది.కానీ రానా వాళ్ళ షాప్ లో దొరికే పుట్టగొడుగుల ధర ఏకంగా లక్షల్లో ఉంటుందని చెప్పాలి.

కూరగాయల్ని సైతం విదేశాల నుంచి తీసుకొస్తారు.మెక్సికో, స్పెయిన్‌, నెదర్లాండ్స్‌ ఇలా ఎన్నో దేశాల నుంచి దిగుమతి చేస్తారు.ఉదాహరణకు నెదర్లాండ్స్‌ నుంచి తీసుకొచ్చిన టమాట ధర 200 గ్రాములకు గానూ రూ.850గా నిర్ణయించారు.ఒక గ్లాస్‌ చెరకు రసం రూ.275గా ఉంది.థాయ్‌లాండ్‌ కు చెందిన కొబ్బరి బోండాం ఒక్కోటి వెయ్యి రూపాయలని తెలుస్తోంది.

Dandruff Homemade Serum : ఈ హోమ్‌ మేడ్ సీర‌మ్ ను వాడితే డాండ్రఫ్ అన్న మాటే అన‌రు!

ఈ ధరలు చూసిన నెటిజన్లు రానా, మిహికా పెట్టిన షాప్‌ కేవలం ధనవంతులకేనని, సామాన్యులు ఇక్కడ ఏదీ కొనే పరిస్థితి లేదని కామెంట్లు చేస్తున్నారు.ఇంకొందరు ఇక్కడే కొంతమంది రైతుల దగ్గర ఫ్రెష్ గా కొనుగోలు చేసి వారికి కూడా ఆదాయ మార్గాన్ని కల్పించవచ్చు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

అయినా అంత ఖర్చు పెట్టి సామాన్యులు ఎప్పుడు కొనుగోలు చేస్తారు అవన్నీ కేవలం రిచ్ పర్సన్స్ కోసం మాత్రమే అంటూ కామెంట్ చేస్తున్నారు.

తాజా వార్తలు