విరాటపర్వం రానా ఫస్ట్ లుక్.. ఉద్యమ నాయకుడు రవి అన్నా పాత్రలో

టాలీవుడ్ లో విప్లవ కథలకి ఆర్ నారాయణమూర్తి పెట్టింది పేరు.ఆయన తీసే సినిమాలు ఎక్కువగా నక్షలిజం నేపధ్యంలోనీవే.

 Rana Daggubati Looks Intense In His First Look, Tollywood, Telugu Cinema, Sai Pa-TeluguStop.com

ఆ తరువాత దాసరి నారాయణరావు ఒసేయ్ రాములమ్మ, అడవిచుక్క లాంటి విప్లవ కథలని తెరపై ఆవిష్కరించి సక్సెస్ అయ్యారు.ఇలాంటి కథలు ఎమోషనల్ గా గ్రామీణ నేపధ్యానికి, సమాజంలో పెత్తందారీ వ్యవస్థలో బానిసత్వ బ్రతకులు బ్రతికిన వారికి స్ఫూర్తిగా నిలుస్తాయి.

కార్మిక, కర్షక వర్గ ప్రజలకి ఎక్కువగా చేరువ అవుతాయి.ఇలాంటి విప్లవ భావాలని రేకెత్తించే సినిమాలు చాలా కాలంగా తెలుగులో రాలేదు.

అయితే వేణు ఊడుగుల ఇప్పుడు విరాటపర్వం సినిమాతో మరోసారి విప్లవ కథని తెరపై ఆవిష్కరిస్తున్నారు.ఇందులో రానా దగ్గుబాటి లీడ్ లో నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా మెజారిటీ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాలలో లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది.

Telugu Ranadaggubati, Sai Pallavi, Telugu, Tollywood, Venu Udugula, Virataparvam

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా నుంచి రానా పుట్టినరోజు సందర్భంగా అతని ఫస్ట్ లుక్ ని చిత్ర యూనిట్ సర్ప్రైజ్ గిఫ్ట్ గా రిలీజ్ చేశారు.దీంతో పాటు సినిమాలో అతని పాత్ర ఏంటి అనేది కూడా పరిచయం చేశాడు.ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో రానా ఉద్యమ నాయకుడుగా దళాన్ని ముందుకి నడిపిస్తూ చేతిలో తుపాకీతో చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు.అతని వెనుక నక్సల్స్ సైన్యం దండులా కదిలి వస్తుంది.

ఇక ఇందులో ఉద్యమ నాయకుడు రవి అన్నా పాత్రలో కనిపించబోతున్నట్లు పోస్టర్ పై క్లారిటీ ఇచ్చారు.ఇక పోస్టర్ లో సాయి పల్లవి పేరు ఫస్ట్ వేసి తరువాత రానా పేరుని వేయడం ద్వారా సినిమాలో ఆమె పాత్ర ప్రాధాన్యత ఏ స్థాయిలో ఉంటుందో చెప్పకనే చెప్పారు.

కొద్ది రోజుల క్రితం సాయి పల్లవి ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ రానాతో నటించడం చాలా గర్వంగా ఉందని పేర్కొంది.మొత్తానికి భారీ అంచనాలతో భారీ క్యాస్టింగ్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏస్థాయిలో థియేటర్ లో ప్రేక్షకులని మెప్పిస్తుంది అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube