భీమ్లా నాయక్ చిత్రం నుంచి డేనియల్ శేఖర్ గా రాణా పరిచయ చిత్రం విడుదల

పవన్ కళ్యాణ్, రాణా దగ్గుబాటి ల కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్‘.స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత ‘త్రివిక్రమ్‘ అందిస్తుండగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు సాగర్ కె చంద్ర.

 Rana Daggubati Look As Daniel Sekhar From Bheemla Naik Movie Revealed, Rana Dagg-TeluguStop.com

భీమ్లా నాయక్‘ చిత్రం నుంచి ‘రాణా‘ పరిచయ చిత్రం ను ఈ రోజు సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు విడుదల చేశారు చిత్ర బృందం.డేనియల్ శేఖర్ గా రాణా పోషిస్తున్న పాత్ర స్వరూప, స్వభావాలు, తీరు తెన్నులు ఎలా ఉంటాయన్న దానికి ఈ ప్రచార చిత్రం ఓ కర్టెన్ రైజర్ లాంటిది.

“నీ మొగుడు గబ్బర్ సింగ్ అంట.? స్టేషన్ లో టాక్ నడుస్తోంది…నేనెవరో తెలుసా ధర్మేంద్ర … హీరో .హీరో.! డేనీ ఎంటర్ టైన్ మెంట్స్ ప్రొడక్షన్ నంబర్ వన్…!” అంటూ ఈ ప్రచార చిత్రం లో డేనియల్ శేఖర్ పాత్ర పలికే సంభాషణలు ఈ విషయాన్ని మరింత స్పష్టం చేస్తాయి.

ప్రస్తుతం చిత్రం షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.తమ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది అని తెలిపారు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ.2022 జనవరి 12 న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు.

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో నిర్మితమవుతున్న ఈ చిత్రం లో నిత్య మీనన్ నాయిక.ప్రముఖ నటులు, రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, నర్రా శ్రీను , కాదంబరికిరణ్, చిట్టి, పమ్మి సాయి, చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

సంభాషణలు, స్క్రీన్ ప్లే: త్రివిక్రమ్ ఛాయాగ్రాహకుడు: రవి కె చంద్రన్ ISC సంగీతం: తమన్.ఎస్ ఎడిటర్: నవీన్ నూలి ఆర్ట్ : ఏ.ఎస్.ప్రకాష్ వి.ఎఫ్.ఎక్స్.సూపర్ వైజర్: యుగంధర్ టి పి.ఆర్.ఓ: లక్షీవేణుగోపాల్ సమర్పణ: పి.డి.వి.ప్రసాద్ నిర్మాత: సూర్యదేవర నాగవంశీ దర్శకత్వం: సాగర్ కె చంద్ర

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube