ప్రతి మనిషి లైఫ్ లోని ముఖ్యమైన ఘట్టాలలో పెళ్లి కూడా ఒకటనే సంగతి తెలిసిందే.పెళ్లికి ముందు పెళ్లి తర్వాత మనిషి జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి.
సెలబ్రిటీలు సైతం పెళ్లి తర్వాత స్నేహితుల విషయంలో, డ్రెస్సింగ్ విషయంలో, ఆహారం విషయంలో, కుటుంబానికి సమయం కేటాయించే విషయంలో మార్పులు చేసుకుంటారు.ప్రముఖ టాలీవుడ్ హీరో రానా మిహీకా బజాజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారనే సంగతి తెలిసిందే.
పాన్ ఇండియా హీరోగా రానాకు తెలుగు, హిందీతో పాటు ఇతర భాషల్లో గుర్తింపు ఉంది.అయితే బాహుబలి తర్వాత రానా నటించిన సినిమాలు ఆ స్థాయిలో సక్సెస్ సాధించలేదు.
లుక్ మార్చుకుని కొత్తగా కనిపిస్తున్న రానా రొటీన్ రోల్స్ చేయడం కంటే జిమ్ లో డంబెల్స్ తో వర్కౌట్లు చేయడమే నయమని చెప్పారు.సినిమా వాతావరణంలోనే తాను పుట్టానని, పెరిగానని రానా చెప్పుకొచ్చారు.
కొత్త కథలలో ముందుకు వచ్చేవాళ్లు ఇండస్ట్రీలో తక్కువని రానా అభిప్రాయపడ్డారు.
అలాంటి ప్రయోగాలు ఎందుకు చేయకూడదనే ఉద్దేశంతో ఇండస్ట్రీకి వచ్చానని రానా తెలిపారు.

బాహుబలితో ఇంటర్నేషనల్ గా గుర్తింపు వచ్చిందని బాలీవుడ్ టాలీవుడ్ హద్దులను ఈ సినిమా చెరిపేసిందని రానా వెల్లడించారు.సినిమాల విషయంలో కుటుంబ సభ్యుల ఒత్తిడి లేదని రానా అన్నారు.ఎన్టీఆర్ మహానాయకుడు మూవీలో చంద్రబాబు రోల్ కోసం 30 కిలోల బరువు తగ్గానని ఆ సమయంలో గుండె, కిడ్నీ సమస్యలు వచ్చాయని రానా చెప్పుకొచ్చారు.

పెళ్లయ్యాక తాను మారిపోయానని చాలామంది అంటున్నారని అందులో నిజం లేదని రానా తెలిపారు.నేను మారిన తర్వాతే పెళ్లి చేసుకున్నాను తప్ప పెళ్లి నన్ను మార్చలేదని రానా చెప్పుకొచ్చారు.సంవత్సరంన్నర క్రితం మిహీకాతో పెళ్లి అయిందని సరైన వ్యక్తి దొరికితే లైఫ్ ఆనందంగా ఉంటుందని లేకపోతే కథ వేరే ఉంటుందని రానా అన్నారు.
మిహీకా ప్రతిరోజునూ రొమాంటిక్ గా మార్చేస్తుందని కొన్ని అనుభూతులను మాటల్లో చెప్పలేమని రానా పేర్కొన్నారు.