పెళ్లి తర్వాత నా జీవితం మారిపోయింది.. రానా కామెంట్స్ వైరల్...

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా రానాకు ఇతర హీరోలతో పోలిస్తే ప్రత్యేక గుర్తింపు ఉంది.విభిన్నమైన కథలను ఎంచుకుంటూ విలక్షణమైన పాత్రల్లో నటిస్తూ నటుడిగా రానా ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు.

 Rana Daggubati Interesting Comments About His Married Life-TeluguStop.com

ఒకవైపు సోలో హీరోగా విరాటపర్వం సినిమాలో నటిస్తున్న రానా మరోవైపు పవన్ కళ్యాణ్ తో కలిసి అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమా రీమేక్ లో నటిస్తున్నారు.తాజాగా ఈ హీరో ప్రముఖ ఛానల్ సోనీతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఆ ఒప్పందం ప్రకారం రానా భారత్ శ్రీలంక మ్యాచ్ తో పాటు టోక్యో 2021కు సంబంధించి తెలుగులో అప్ డేట్స్ ఇవ్వనున్నారు.తాను చెన్నైలో, హైదరాబాద్ లో ఉన్న సమయంలో తెలుగు చాలా ఆలస్యంగా నేర్చుకున్నానని రానా అన్నారు.

 Rana Daggubati Interesting Comments About His Married Life-పెళ్లి తర్వాత నా జీవితం మారిపోయింది.. రానా కామెంట్స్ వైరల్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

భాషను లోతుగా నేర్చుకుంటే అక్కడి కల్చర్ అర్థమవుతోందని రానా పేర్కొన్నారు.పెళ్లి, సినిమాల గురించి కూడా స్పందించిన రానా ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

పెళ్లి తరువాత జీవితం చాలా మారిపోయిందని రానా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.పెళ్లి తర్వాత మ్యాడ్ నెస్ కు స్టెబిలిటీ వచ్చిందని కామ్ గా ఉన్నానని మరింత ఫోకస్ గా, మరింత ఆర్గనైజ్డ్ గా సినిమాలు చేస్తున్నానని రానా తెలిపారు.త్వరలో తన ఫ్యామిలీలోని హీరోలతో కలిసి మల్టీస్టారర్ చేస్తానని రానా అన్నారు.ప్రయోగాత్మక సినిమాల్లో నటించడం గురించి మాట్లాడుతూ కొత్త కథలను చేయడానికి ఇష్టపడతానని రానా పేర్కొన్నారు.

ఒక్కో ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ కొత్త విషయాలు నేర్చుకుంటున్నానని రానా పేర్కొన్నారు.కరోనా వల్ల వచ్చిన గ్యాప్ లో కొత్త కథలు విన్నానని రానా తెలిపారు. బిగ్ బాస్ హోస్ట్ గా చేయడం లేదని తనకు రిలాక్స్ గా చేసే పనులు ఇష్టమని రానా వెల్లడించారు.వెంకటేష్, రానా, అభిరామ్ కాంబినేషన్ లో త్వరలో మల్టీస్టారర్ సినిమా తెరకెక్కనుంది.

#Married Life #Abhiram #Rana Daggubati #Rana Movies #Virata Parvam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు