క్రిష్‌ మార్క్‌, ఎన్టీఆర్‌కు పెద్ద ప్లాన్‌       2018-06-13   22:14:14  IST  Raghu V

నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందబోతున్న ‘ఎన్టీఆర్‌’ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రం దర్శకత్వ బాధ్యతలను క్రిష్‌కు అప్పగించిన బాలయ్య ఊపిరి పీల్చుకున్నాడు. అయితే క్రిష్‌ మాత్రం చాలా జాగ్రత్తగా తన మార్క్‌తోనే స్క్రీన్‌ప్లేను ఇప్పటికే సిద్దం చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం నటీనటుల ఎంపిక కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికే కాస్టింగ్‌ కాల్‌తో కొందరిని ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. తాజాగా ఈ చిత్రం కోసం రానాను కూడా క్రిష్‌ సంప్రదించినట్లుగా సమాచారం అందుతుంది. భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రంలో చంద్రబాబు నాయుడు పాత్రను రానాతో చేయిస్తున్నాడు.

బాలకృష్ణ అనుకున్నట్లుగానే పాజిటివ్‌ ఎలిమెంట్స్‌తో ఎన్టీఆర్‌ కథను నడిపించాని భావిస్తున్న క్రిష్‌ తనదైన శైలిలో స్క్రీన్‌ప్లేతో ఆ కథను నడిపించేందుకు పక్కా ప్రణాళిక సిద్దం చేశాడు. ప్రస్తుతం బాలీవుడ్‌లో మణికర్ణిక చిత్రంను విడుదలకు సిద్దం చేస్తూనే మరో వైపు ఎన్టీఆర్‌ చిత్రం కోసం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ను ప్రణాళికబద్దంగా చేస్తున్నాడు. భారీ చిత్రాలను తన తెలివి తేటలతో సింపుల్‌గా పూర్తి చేసే క్రిస్‌ ఈ చిత్రాన్ని కూడా తప్పకుండా ఆకట్టుకునే విధంగా చేస్తాడనే నమ్మకంను బాలయ్య వ్యక్తం చేస్తున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ తన తండ్రి పాత్రను పోషించేందుకు హోం వర్క్‌ చేస్తున్నాడు.

‘ఎన్టీఆర్‌’ చిత్రంలో పలు పాత సినిమాలకు సంబంధించిన విషయాలను తెలియజేయాలని భావిస్తున్నారు. అందుకే అప్పటి తరం వారిని కలుస్తున్నారు. ‘మహానటి’ సావిత్రిలో మాదిరిగానే పాత తరం సీన్స్‌ను బ్లాక్‌ అండ్‌ వైట్‌లో చూపించడం వల్ల ప్రేక్షకులు ఆ తరంకు వెళ్లి పోతారు అని క్రిష్‌ కూడా భావిస్తున్నాడు. ఒకే పార్ట్‌లో ఎన్టీఆర్‌ బాల్యం, సినీ జీవితం, రాజకీయ జీవితంను చూపించడం అసాధ్యం అని కొందరు అంటున్నారు. కాని అసాధ్యంను సుసాధ్యం చేస్తాను అంటూ క్రిష్‌ నమ్మకంగా చెబుతున్నాడు.

ఎన్నో అంచనాలున్న ‘ఎన్టీఆర్‌’ చిత్రాన్ని జులై లేదా ఆగస్టులో సెట్స్‌ పైకి తీసుకు వెళ్లబోతున్నారు. సంక్రాంతికి విడుదల చేస్తామని ఇప్పటికే బాలయ్య ప్రకటించాడు. తేజ దర్శకత్వంలో అనుకున్నప్పుడు ఈ చిత్రంలో కళ్యాణ్‌ రామ్‌ ముఖ్య పాత్రలో కనిపిస్తాడని అంతా భావించారు. కాని తాజాగా క్రిష్‌ చేతుల్లోకి ప్రాజెక్ట్‌ వెళ్లి పోయిన తర్వాత బాలయ్యతో పాటు రానా కీలక పాత్రల్లో కనిపిస్తాడని అంటున్నారు. రానాతో గతంలో కృష్ణంవందే జగద్గురుం చిత్రాన్ని చేసిన క్రిష్‌కు మంచి సన్నిహిత్యం ఉంది. ఆ సన్నిహిత్యం తోనే ఎన్టీఆర్‌ చిత్రంలో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.