క్రిష్‌ మార్క్‌, ఎన్టీఆర్‌కు పెద్ద ప్లాన్‌     2018-06-13   22:14:14  IST  Raghu V

నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందబోతున్న ‘ఎన్టీఆర్‌’ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రం దర్శకత్వ బాధ్యతలను క్రిష్‌కు అప్పగించిన బాలయ్య ఊపిరి పీల్చుకున్నాడు. అయితే క్రిష్‌ మాత్రం చాలా జాగ్రత్తగా తన మార్క్‌తోనే స్క్రీన్‌ప్లేను ఇప్పటికే సిద్దం చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం నటీనటుల ఎంపిక కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికే కాస్టింగ్‌ కాల్‌తో కొందరిని ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. తాజాగా ఈ చిత్రం కోసం రానాను కూడా క్రిష్‌ సంప్రదించినట్లుగా సమాచారం అందుతుంది. భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రంలో చంద్రబాబు నాయుడు పాత్రను రానాతో చేయిస్తున్నాడు.

బాలకృష్ణ అనుకున్నట్లుగానే పాజిటివ్‌ ఎలిమెంట్స్‌తో ఎన్టీఆర్‌ కథను నడిపించాని భావిస్తున్న క్రిష్‌ తనదైన శైలిలో స్క్రీన్‌ప్లేతో ఆ కథను నడిపించేందుకు పక్కా ప్రణాళిక సిద్దం చేశాడు. ప్రస్తుతం బాలీవుడ్‌లో మణికర్ణిక చిత్రంను విడుదలకు సిద్దం చేస్తూనే మరో వైపు ఎన్టీఆర్‌ చిత్రం కోసం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ను ప్రణాళికబద్దంగా చేస్తున్నాడు. భారీ చిత్రాలను తన తెలివి తేటలతో సింపుల్‌గా పూర్తి చేసే క్రిస్‌ ఈ చిత్రాన్ని కూడా తప్పకుండా ఆకట్టుకునే విధంగా చేస్తాడనే నమ్మకంను బాలయ్య వ్యక్తం చేస్తున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ తన తండ్రి పాత్రను పోషించేందుకు హోం వర్క్‌ చేస్తున్నాడు.