హిరణ్యకశిపుడు ఆగిపోయే ప్రసక్తే లేదట

బాహుబలి చిత్రంతో ప్రభాస్ ఎలాంటి క్రేజ్‌ను సాధించాడో భళ్లాలదేవగా నటించిన రానా దగ్గుబాటి అంతే క్రేజ్‌ను దక్కించుకున్నాడు.ఇక ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోయాడు.

 Rana Daggubati, Hiranyakasipa, Suresh Babu, Gunasekhar, Tollywood News-TeluguStop.com

ఈ క్రమంలో రానా చేసిన సినిమాలు ప్రేక్షకులను మెప్పించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాయి.కాగా కమర్షియల్ సక్సెస్ మాత్రం తేజ డైరెక్షన్‌లో వచ్చిన నేనే రాజు నేనే మంత్రి సినిమాతో అందుకున్నాడు.

కాగా గతంలో దర్శకుడు గుణశేఖర్ డైరెక్షన్‌లో రుద్రమదేవి సినిమాలో నటించిన రానా, ఆ తరువాత గుణశేఖర్‌తో మరో భారీ బడ్జెట్ సినిమాను ప్లాన్ చేశాడు.

హిరణ్యకశిప అనే భారీ చిత్రానికి గుణశేఖర్ ఎప్పటినుండో ప్లాన్ చేస్తున్నాడు.

కాగా గతకొన్నేళ్లుగా ఈ సినిమాను ప్రారంభించాలని చూస్తున్న గుణశేఖర్, కొన్ని కారణాల వల్ల వాయిదా వేస్తూ వస్తున్నాడు.అయితే ఇటీవల రానాతో కలిసి ఈ సినిమాను ప్రారంభించేందుకు గుణశేఖర్ సిద్ధమయ్యాడు.

పెరుగుతున్న బడ్జెట్‌తో పాటు భారీగా తీయాలనే ఆశతో ఈ సినిమా అసలు పట్టాలెక్కుతుందో లేదో అనే సందేహం అందరిలో మొదలైంది.కాగా తాజాగా ఈ సినిమాపై ప్రొడ్యూసర్ సురేష్ బాబు క్లారిటీ ఇచ్చాడు.

/br>

ఈ సినిమా ఆగిలపోలేదని, ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని ఆయన తెలిపాడు.భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఖచ్చితంగా తెరకెక్కిస్తామని ఆయన తేల్చి చెప్పాడు.

దీంతో హిరణ్యకశిప సినిమా ఇంకా బతికే ఉందని తేలిపోయింది.ఇక ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube