అత్తారింటికి వెళ్ళిన రానా.. కారణం అదేనా?

టాలీవుడ్ స్టార్ హీరో రానా.ఈయన పరిచయం గురించి తెలుగు ప్రేక్షకులకు అందరికీ తెలిసిందే.

 Rana Daggubati Goes Maheeka Bajaj House To Celbrate Birthday-TeluguStop.com

లీడర్ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన రానా తొలి సినిమాతోనే మంచి గుర్తింపు అందుకున్నాడు.ఆ తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు అందుకున్నాడు.

పాన్ ఇండియా బాహుబలి సినిమా తో మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు.ప్రస్తుతం వరుస సినిమాలలో బిజీగా ఉన్నాడు.

 Rana Daggubati Goes Maheeka Bajaj House To Celbrate Birthday-అత్తారింటికి వెళ్ళిన రానా.. కారణం అదేనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటే ఇటీవలే తన అత్తారింటికి వెళ్లాడు రానా.

Telugu Celbrate Birthday, Maheeka Bajaj, Mothe In Law House, Rana Daggubati, Tollywood-Movie

గత ఏడాది రానా తన ప్రేయసి మిహిక బజాజ్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.అతి తక్కువ మంది కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్న రానా తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకున్నాడు.ఇక పెళ్లి తర్వాత మరింత బిజీ గా మారిన రానా అటు సినిమాలతో ఇటు ఫ్యామిలీతో సమానంగా గడుపుతున్నాడు.

ఇదిలా ఉంటే రానా గురువారం రోజు తన అత్తారింటికి వెళ్ళాడు.అక్కడ తన భార్య మిహిక తల్లి బంటి బజాజ్ పుట్టినరోజు వేడుకలో పాల్గొన్నాడు.వేడుకలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇందులో రానా తో పాటు తన భార్య మిహిక, తన అత్తయ్య, మామయ్యలు కూడా ఉన్నారు.

ఇక తన అల్లుడు రాకతో కొన్ని విషయాలు పంచుకుంది బంటి బజాజ్.తన పుట్టిన రోజు ఇంత ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసినందుకు తన కుటుంబానికి ధన్యవాదాలు అని తెలిపింది.

Telugu Celbrate Birthday, Maheeka Bajaj, Mothe In Law House, Rana Daggubati, Tollywood-Movie

ఇదిలా ఉంటే రానా ప్రస్తుతం వరుస సినిమాలలో బిజీగా ఉండగా వేణు దర్శకత్వంలో తెరకెక్కనున్న విరాటపర్వం సినిమాలో నటిస్తున్నాడు.ఇందులో సాయి పల్లవి, ప్రియమణి లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.అంతేకాకుండా పవన్ కళ్యాణ్ నటిస్తున్న అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ సినిమాలో కూడా నటిస్తున్నాడు.ఇటీవలే అరణ్య సినిమాలో నటించగా అది అంతగా సక్సెస్ ఇవ్వలేదు.సుకుమార్ శిష్యుడైన వెంకీ వినిపించిన కథకు కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తుంది రానా.

#Maheeka Bajaj #Rana Daggubati

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు