ప్రేమకావాలి అంటోన్న దగ్గుబాటి హీరో  

Rana Daggubati Aranya Virataparvam - Telugu Aranya, Rana Daggubati, Romantic Movies, Virataparvam

బాహుబలి చిత్రంతో ప్రభాస్ ఎంత పేరు తెచ్చుకున్నాడో విలన్ భళ్లాలదేవ పాత్రలో నటించిన రానా దగ్గుబాటి కూడా అంతే పేరును తెచ్చుకున్నాడు.ఇక ఆ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో వరుసగా సెలెక్టివ్ సినిమాలు చేస్తూ ఆలిండియా స్టార్‌గా రానా మారాడు.

 Rana Daggubati Aranya Virataparvam

అయితే ప్రస్తుతం వరుస సినిమాలను లైన్‌లో పెట్టిన రానా వాటిని రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.

ఇప్పటికే పాన్ ఇండియా మూవీగా అరణ్య(హాతీ మేరే సాతీ) చిత్రాన్ని రానా రిలీజ్‌కు రెడీ చేశాడు.

ప్రేమకావాలి అంటోన్న దగ్గుబాటి హీరో-Gossips-Telugu Tollywood Photo Image

ఈ సినిమాలో రానా ఓ విలక్షణమైన పాత్రలో నటిస్తున్నాడు.ఇక ఈ సినిమా తరువాత విరాటపర్వం అనే సినిమాలో నటిస్తున్నాడు.

వేణు ఉడుముల డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రానా ఓ నక్సలైట్ పాత్రలో నటిస్తాడని తెలుస్తోంది.ఈ రెండు సినిమాలు కూడా సమాజానికి సందేశమిచ్చే సినిమాలుగా వస్తుండటంతో తన నెక్ట్స్ సినిమాపై రానా ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు.

తన నెక్ట్స్ మూవీని పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దాలని రానా చూస్తున్నాడట.ఇటీవల కాలంలో ఆయన రొమాంటిక్ చిత్రాల్లో నటించలేదు.దీంతో తాను కూడా హీరోయిన్‌తో రొమాన్స్ చేయాలని చూస్తున్నట్లు రానా చెప్పుకొచ్చాడు.మరి రానా కోరికను ఎవరు తీరుస్తారో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rana Daggubati Wants Romantic Movies Related Telugu News,Photos/Pics,Images..