రానా దగ్గుబాటి ‘అరణ్య’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

టాలీవుడ్ హంక్ రానా దగ్గుబాటి నటించిన ‘అరణ్య’ చిత్రం గతేడాదే రిలీజ్ కావాల్సి ఉన్నా, కరోనా లాక్‌డౌన్ కారణంగా అది వాయిదా పడింది.ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తారని, ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కాదు లాంటి అనేక అనుమానాలకు ఫుల్‌స్టాప్ పెడుతూ, అరణ్య చిత్రం నేడు(మార్చి 26) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయ్యింది.

 Rana Daggubati Aranya Movie Review And Rating, Rana Daggubati, Aranya, Vishnu Vi-TeluguStop.com

ఈ సినిమాలో రానా గెటప్‌కు ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ దక్కడంతో ఈ సినిమా ఖచ్చితంగా వారిని ఆకట్టుకుంటుందనే అంచనాలు నెలకొన్నాయి.మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర మెప్పించిందో రివ్యూలో చూద్దాం.

అరణ్య’ సినిమా కథ విషయానికివస్తే, నరేంద్ర భూపతి(రానా దగ్గుబాటి) వైజాగ్‌లోని చిలకలకోన అడవిలో పుట్టిపెరిగిన వ్యక్తి.అక్కడి అడవి మృగాలు, ఏనుగులతో నరేంద్ర భూపతి స్నేహం చేస్తాడు.

అంతరించిపోతున్న అడవి జీవాలను కాపాడాలని ఆయన అనుకుంటాడు.కట్ చేస్తే.

అటవీశాఖ మంత్రి అయిన కనకమేడల రాజగోపాలం(అనంత్ మహదేవన్) అడవిలో ఓ స్మార్ట్ సిటీని నిర్మించాలని ప్లాన్ చేస్తాడు.దీంతో అతడు నిర్మించాలనే స్టార్ట్ సిటీ ప్రాజెక్ట్ సైట్‌లో ఏనుగులు అడుగుపెట్టకుండా అడవిలో ఓ పెద్ద గోడను కట్టేస్తాడు.

మరి ఆ మంత్రి వ్యూహాన్ని నరేంద్ర భూపతి ఏ విధంగా అడ్డుకుంటాడు? అడవిలో ఏనుగులను నరేంద్ర ఎలా కాపాడుతాడు? అనేది సినిమా కథ.

Telugu Aranya, Aranya Review, Prabhu Solomon, Rana Daggubati, Vishnu Vishal-Movi

కాగా ఈ సినిమాతో మంచి సందేశాన్ని ఇవ్వాలని చూసిన దర్శకుడు ప్రభు సోలోమాన్, ఈ సినిమాను రొటీన్ స్క్రీన్‌ప్లేతో తెరకెక్కించడంతో ఈ సినిమా ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.ఇక ఈ సినిమాలోని కథలో దమ్మున్నప్పటికీ, దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.అంతేగాక ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ అంశాలు కూడా పెద్దగా లేకపోవడంతో సదరు ఆడియెన్స్‌కు ఈ సినిమా చాలా బోరింగ్‌గా కనిపిస్తుంది.

ఇక నరేంద్ర భూపతి అలియాస్ అరణ్య పాత్రలో రానా దగ్గుబాటి అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పాలి.ఈ సినిమాను మూడు భాషల్లో తెరకెక్కించడంతో మనకు రానా, రఘుబాబు తప్ప మరే ఇతర నటీనటులు కూడా పెద్దగా తెలియకపోవడం, ఈ సినిమాలోని సంగీతం ప్రేక్షకులను అలరించలేకపోవడంతో ఈ సినిమా యావరేజ్ మూవీగా నిలిచింది.

చివరగా:

అరణ్య – అడవిలో కలిసిపోయిన అంచనాలు!

రేటింగ్:2.5/5.0

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube