చరణ్‌ స్థానం భర్తీ చేయబోతున్న రానా?  

Ram Charan, Rana Daggubati, Acharya, Koratala Shiva, Chiranjeevi, Rana to Play Ram Charan Role - Telugu Acharya, Chiranjeevi, Koratala Shiva, Ram Charan, Rana Daggubati, Rana To Play Ram Charan Role

చిరంజీవి ఆచార్య చిత్రం అన్ని అనుకున్నట్లుగా జరిగితే షూటింగ్‌ పూర్తి అయ్యి వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చేది.కాని కరోనా కారణంగా సినిమా షూటింగ్‌ నిలిచి పోయింది.

 Rana Daggubati Acharya Koratala Siva

సినిమాకు సంబంధించి అనేక మార్పులు చేర్పులు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.ఈ చిత్రంలో కీలక పాత్రకు గాను రామ్‌ చరణ్‌ను కొరటాల శివ భావించాడు.

చరణ్‌ ఓకే చెప్పడంతో పాత్ర పరిధి ఇంకాస్త పెంచాడు.హీరోయిన్‌ మరియు సాంగ్‌ను కూడా పెట్టాడు.

చరణ్‌ స్థానం భర్తీ చేయబోతున్న రానా-Movie-Telugu Tollywood Photo Image

కరోనా కారణంగా ప్లానింగ్‌ అంతా తారు మారు అయ్యింది.చరణ్‌ వెంటనే ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌లో జాయిన్‌ కావాల్సి ఉంది.ఆచార్య చిత్రం ఎప్పటికి ప్రారంభం అయ్యేది తెలియని పరిస్థితి.రెండు సినిమాలకు డేట్లు క్లాష్‌ అయ్యే అవకాశం ఉంది.

అందుకే సినిమా నుండి తప్పుకోవడం ఉత్తమంగా భావించాడు.తానే ఒక నిర్మాత అయినా కూడా తాను నటిస్తే మంచి క్రేజ్‌ వస్తుందని తెలిసినా కూడా చరణ్‌ తప్పుకునేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్‌ చూపించాడు.

రామ్‌ చరణ్‌ తప్పుకోవడంతో ఆ పాత్రకు గాను రానాను సంప్రదిస్తున్నారట.ఆ పాత్ర కాస్త తగ్గించి రెండు వారాల పాటు రానా డేట్లు కావాలంటూ కొరటాల శివ అండ్‌ టీం అడిగారట.అందుకు రానా కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు.ఆచార్య చిత్రంలో అనడంతో మరో ఆలోచన లేకుండా రానా ఓకే చెప్పాడంటూ సమాచారం అందుతోంది.ఈ ఏడాది చివరికి లేదా వచ్చే ఏడాదిలో సినిమా షూటింగ్‌ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.రానా ఆచార్యలో నటించడం కూడా మంచి హైప్‌ను తీసుకు వస్తుందని ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకంగా ఉన్నారు.

#Acharya #Chiranjeevi #Rana Daggubati #Koratala Shiva #Ram Charan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rana Daggubati Acharya Koratala Siva Related Telugu News,Photos/Pics,Images..