తండ్రులు, తాతల పాత్రలు మీకు... చంద్రబాబు పాత్ర నాకా? దూల తీరిపోయిందంటూ రానా సంచలన కామెంట్స్!  

  • నందమూరి బాలకృష్ణ హీరోగా, నిర్మాతగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘యన్.టి.ఆర్’. తన తండ్రి జీవితకథను బయోపిక్‌గా ఆయన రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. విద్యాబాలన్, రానా, నందమూరి కల్యాణ్‌రామ్, సుమంత్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది.

  • Rana Comments On His Role In NTR Biopic-Chandrababu Naidu Director Krish Kalyan Am Ntr Biopic Rana Daggubati Sumanth

    Rana Comments On His Role In NTR Biopic

  • ఇప్పటికే విడుదలైన ట్రైలర్ అందరిని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు పాత్ర పోషించిన రానా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందరి కంటే తన పాత్ర ఎంతో కష్టమైందని అన్నారు. ‘‘మీ అందరూ మీ తండ్రులు, తాతల పాత్రలు పోషించారు. కానీ నాది మాత్రం చంద్రబాబు నాయుడుగారి పాత్ర. నాకు అది చాలా కష్టమైంది. ఇది బాహుబలి తర్వాత చేస్తున్న సినిమా నా 20 ఏళ్ల కెరీర్‌లో ఆయన ప్రభావం చాలా ఉంది.

  • Rana Comments On His Role In NTR Biopic-Chandrababu Naidu Director Krish Kalyan Am Ntr Biopic Rana Daggubati Sumanth
  • క్రిష్ వచ్చి నాకు చెప్పినప్పుడు ఓ చరిత్ర చెప్పినట్లు అనిపించింది. ఆ తర్వాత మనం ముగ్గురం కలిసి చంద్రబాబునాయుడుగారి దగ్గరకు వెళ్లాం. అప్పుడు నేను చేసిన పార్ట్స్‌ అన్ని క్రిష్ నాకు చెప్పినట్టే చంద్రబాబుగారు చెప్పారు. ఆయన వల్లే నాకు ఈ పాత్ర చేయడం మరింత సులభమైంది. లేకుంటే ఒక నటుడికి ఇంత హోంవర్క్ చేయడం సాధ్యమయ్యేది కాదు’’ అని రానా అన్నారు.