ప్రభాస్‌ మూవీలో మరోసారి విలన్‌గా భల్లాలదేవుడు

ప్రభాస్‌ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు.ఆ తర్వాత నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో సినిమాను చేసేందుకు ప్రభాస్‌ రెడీ అయ్యాడు.

 Rana Daggubati, Prabhas, Rana As Villain In Prabhas Movie, Socio Fantasy,nag Ash-TeluguStop.com

ఇప్పటికే సినిమా అధికారిక ప్రకటన వచ్చింది.అశ్వినీదత్‌ భారీ బడ్టెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సిద్దం అయ్యాడు.

ఈ చిత్రంలో హీరోయిన్‌ ఎవరు అనే విషయంలో క్లారిటీ ఇంకా రాకుండానే విలన్‌ విషయంలో మళ్లీ చర్చ ప్రారంభం అయ్యింది.

ఈ చిత్రంలో విలన్‌ పాత్ర ఎవరు పోషిస్తారు అనే విషయంలో మీడియాలో జరుగుతున్న ప్రచారం సినిమాపై అంచనాలు భారీగా పెంచుతున్నాయి.

రానా ఈ సినిమాలో విలన్‌ పాత్రను పోషించేందుకు సిద్దం అయ్యాడని అంటున్నారు.బాహుబలి చిత్రంలో ప్రభాస్‌ హీరోగా నటించగా విలన్‌ పాల్రో రానా నటించాడు.ఇప్పుడు మరోసారి రానా విలన్‌గా ప్రభాస్‌ కోసం నటించేందుకు ఓకే చెప్పాడని సమాచారం అందుతోంది.

Telugu Nag Ashwin, Prabhas, Ranavillain, Rana Daggubati, Socio Fantasy-

భారీ సోషియో ఫాంటసీ కథాంశంతో ఈ చిత్రం రూపొందబోతున్న విషయం తెల్సిందే.అందులో భాగంగానే ఒక ఫాంటసీ పాత్రలో రానా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.నాగ్‌ అశ్విన్‌ ఇటీవలే రానాకు కథ చెప్పడంతో పాటు ఆయన్ను ఒప్పించాడంటూ వార్తలు వస్తున్నాయి.

ఒకవేళ రానా ఈ సినిమాకు ఓకే చెప్తే ఖచ్చితంగా సినిమా అంచనాలు ఆకాశాన్ని తాకడం ఖాయం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube