కార్పోరేట్ స్మగ్లర్లని వెంటాడుతున్న రానా... అరణ్య టీజర్  

Rana Aranya Movie Teaser Release-bollywood,kollywood,rana,teaser Release,tollywood

తన విలక్షణ నటనతో టాలీవుడ్ లోనే కాకుండా ఇండియన్ యాక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు రానా.ఘాజీ సినిమా తర్వాత రానా చాలా గ్యాప్ తీసుకొని అరణ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు.

Rana Aranya Movie Teaser Release-Bollywood Kollywood Rana Teaser Release Tollywood

హిందీలో హాథీ మేరీ సాథీ పేరుతో ఈ సినిమా తెర‌కెక్కింది.ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ తో సినిమా మీద హైప్ క్రియేట్ చేసిన చిత్ర యూనిట్ తాజాగా ఈ సినిమా టీజర్ ని ముంబ‌యి, చెన్నైలలో హిందీ, తమిళ భాషలలో రిలీజ్ చేశారు.

తెలుగు టీజ‌ర్ ఇంకా విడుద‌ల చేయాల్సి ఉంది అడ‌విలోనే పుట్టి పెరిగి, అక్కడి అడవి జంతువులతో అనుబంధం పెంచుకున్న టార్జాన్ త‌ర‌హా క్యారెక్టర్ లో హీరో రానా మాసిపోయిన గెడ్డం, బట్టలు, చేతిలో ఒక కర్రతో కనిపించాడు.అడ‌విలో రియ‌ల్ ఎస్టేట్ వెంచ‌ర్ లు వేసి జంతువుల మ‌నుగ‌డ‌కు ప్రమాదకరంగా కార‌ణ‌మైన వ్య‌క్తుల‌పై రానా అక్కడి గిరిజన జనంతో కలిసి పోరాటం చేస్తున్నాడు.

టీజర్ బట్టి చూస్తే అడవులు విద్వంసం వలన నష్టం వన్యప్రాణుల సంరక్షణ బాద్యతని దర్శకుడు చూపించబోతున్నట్లు తెలుస్తుంది.రియల్ ఎస్టేట్, స్మగ్లింగ్ ల ద్వారా ప్రకృతిని ద్వసం చేస్తున్న కార్పోరేట్ మనుషులపై యుద్ధం చేసే ధీరుడుగా రానా డిఫరెంట్ గా కనిపించబోతున్నాడు.

ఇక ఆ క్యారెక్టర్ కి తగ్గట్లు జంతువుల తరహాలో బాడీ లాంగ్వేజ్, ఆహార్యంతో రానా కనిపించాడు.త‌మిళ వెర్ష‌న్లో విష్ణు విశాల్ ఓ కీల‌క పాత్ర చేయ‌గా, హిందీలో అదే పాత్ర‌ను పుల‌కిత్ సామ్రాట్ చేశాడు.

ఈరోస్ ఇంట‌ర్నేష‌న‌ల్ లాంటి బ‌డా బాలీవుడ్ నిర్మాణ సంస్థ అర‌ణ్య సినిమాను ప్రొడ్యూస్ చేసింది.టీజర్ తో ఆకట్టుకున్న ఈ సినిమా ప్రేక్షకులని ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తుంది.

.

తాజా వార్తలు

Rana Aranya Movie Teaser Release-bollywood,kollywood,rana,teaser Release,tollywood Related....