అడవి మనిషిలా మారిపోయిన రానా.. అరణ్య ఫస్ట్ లుక్

టాలీవుడ్ లో నిర్మాత సురేష్ తనయుడుగా ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలోనే నటుడుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న వ్యక్తి దగ్గుబాటి రానా.రెగ్యులర్ కమర్షియల్ హీరోలకి భిన్నంగా విభిన్న కథలతో నటుడుగా ప్రూవ్ చేసుకుంటూ ఈ రోజు ఇండియన్ యాక్టర్ అనే స్థాయిలో రానా గుర్తింపు తెచ్చుకున్నాడు.

 Rana Aranya Movie First Look Release-TeluguStop.com

భాషతో సంబంధం లేకుండా క్యారెక్టర్ నచ్చితే ఎక్కడైనా చేయడానికి రెడీగా ఉండే రాజా చాలా గ్యాప్ తర్వాత పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.

ప్రభు సోలోమాన్ దర్శకత్వంలో హిందీలో హాథీ మేరే సాథీ టైటిల్ తో సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో రానా బన్ దేవ్ అనే ఆదివాసి పాత్రలో ఏనుగులని అదుపుచేసే మావటివాడుగా కనిపిస్తున్నాడు.ఇక ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ ‌లుక్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

తెలుగు తమిళ హిందీ బాషల్లో రుపొందిస్తు్న్నా ఈ సినిమాకి తెలుగులో తెలుగులో అరణ్య తమిళంలో కాదన్‌ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

Telugu Bollywood, Kollywood, Rana Aranya, Tollywood-

మానవులు-జంతువుల ప్రతిబింబించే వాస్తవ కథాంశాలతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.అడవి జంతువులని చంపేసి, అడవులని ద్వంసం చేసే అక్రమార్కులపై ఇందులో రానా పోరాటం చేస్తాడని తెలుస్తుంది.ఏప్రిల్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నట్లు తెలుస్తుంది.

రెండేళ్ళ గ్యాప్ తర్వాత వస్తున్న రానా ఈ సినిమాతో ప్రేక్షకులని ఎంత వరకు ఆకట్టుకుంటాడు అనేది వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube