కేవలం 30 మంది కుటుంబ సభ్యుల మధ్యనే రానా-మిహికా పెళ్లి వేడుక  

rana and mihika wedding only within family members, Tollywood, Suresh Babu, Daggubati Rana, Celebrity Marriages - Telugu Celebrity Marriages, Daggubati Rana, Rana And Mihika Wedding Only Within Family Members, Suresh Babu, Tollywood

ఈ ఏడాది టాలీవుడ్ హీరోలు ఒకరి తర్వాత ఒకరు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు.అయితే గ్రాండ్ గా పెళ్లి చేసుకోవాలని అనుకున్న వారి కలలకు కరోనా ఫుల్ స్టాప్ పెట్టింది.

TeluguStop.com - Rana And Mihika Wedding Only Within Family Members

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

అతిరధ ప్రముఖుల మధ్య వైభవంగా జరగాల్సిన పెళ్లి వేడుక ఈ కరోనా కష్టంతో అతి కొద్ది బంధువులు, కుటుంబ సభ్యుల సమక్షంలోనే జరుగుతున్నాయి.ఇప్పటికే యువ హీరోలైన నిఖిల్, నితిన్ పెళ్లి చేసుకున్నారు.

TeluguStop.com - కేవలం 30 మంది కుటుంబ సభ్యుల మధ్యనే రానా-మిహికా పెళ్లి వేడుక-Movie-Telugu Tollywood Photo Image

వారి కుటుంబ సభ్యుల సమక్షంలోనే పెళ్లి వేడుకని చాలా సింపుల్ గా ముగించేశారు.ఇక ఇప్పుడు హీరో రానా పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు.

తాను ప్రేమించిన మిహికాతో ఈ నెల 8న వివాహం జరగనుంది.ఇప్పటికే వీరి రెండు కుటుంబాలలో పెళ్లి పనులు ప్రారంభం అయిపోయాయి.

అయితే రానా-మిహిక పెళ్లి వేడుకకి సినీ ప్రముఖులు హాజరవుతారని, వైభవంగా జరగనుంది అంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది.దీనికి సురేష్ బాబు ఫుల్ స్టాప్ పెట్టాడు.

రానా పెళ్లి చాలా సింపుల్ గా జరుగుతుందని.కేవలం 30 మంది అతిథులు మాత్రమే హాజరవుతారని చెప్పారు.

వీరిలో ఇరు కుటుంబ సభ్యులు తప్ప బంధువులు, సినీ పెద్దలు ఎవరూ హాజరుకావడం లేదని తేల్చి చెప్పేశారు. కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఈ పెళ్లి వేడుక జరుపుతామని అన్నారు.

పెళ్లికి వచ్చే వాళ్లందరికీ కచ్చితంగా కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.రెండు కుటుంబాలు సమ్మతితోనే కేవలం కుటుంబ సభ్యుల మధ్యన ఈ పెళ్లి వేడుక జరిపించడం జరుగుతుందని తెలిపారు.

ఇక తెలుగు, మార్వాడి సంప్రదాయల ప్రకారం పెళ్లి వేడుకలు జరగనున్నట్లు తెలుస్తుంది.మొత్తానికి ఈ ఏడాది సెలబ్రిటీ పెళ్ళిళ్ళు ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్ గా జరిగిపోతున్నాయని చెప్పాలి.

#Daggubati Rana #Suresh Babu #RanaAnd

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rana And Mihika Wedding Only Within Family Members Related Telugu News,Photos/Pics,Images..