బంగార్రాజు మూవీ నుండి ర‌మ్య‌కృష్ణ స్పెష‌ల్ బ‌ర్త్‌డే పోస్ట‌ర్ విడుద‌ల‌

బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ `సోగ్గాడే చిన్ని నాయనా` సీక్వెల్ `బంగార్రాజు` కోసం నాగార్జున మరియు రమ్యకృష్ణ మరోసారి కలిసి న‌టిస్తున్నారు.కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్నారు.

 Ramyakrishna Special Birthday Poster Release From Bangaraju Movie-TeluguStop.com

ఈ మూవీలో నాగ చైతన్య మ‌రో హీరోగా న‌టిస్తున్నారు.నాగ‌చైత‌న్య‌ సరసన కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తోంది.

ఇప్పటికే విడుదలైన నాగార్జున లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.ఈ బుధవారం రమ్యకృష్ణ పుట్టినరోజు సందర్భంగా సత్యభామగా ఆమె లుక్‌ను విడుదల చేశారు.

 Ramyakrishna Special Birthday Poster Release From Bangaraju Movie-బంగార్రాజు మూవీ నుండి ర‌మ్య‌కృష్ణ స్పెష‌ల్ బ‌ర్త్‌డే పోస్ట‌ర్ విడుద‌ల‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ పోస్టర్‌లో నాగార్జున మరియు రమ్యకృష్ణ సంప్రదాయ వస్త్రధారణలో న‌ది ఒడ్డున డ్యాన్స్ చేస్తున్నారు.వారిద్ద‌రి మ‌ధ్య మనోహరమైన కెమిస్ట్రీని మ‌నం చూడొచ్చు.ఈ వారిద్దరు చూడముచ్చటగా కనిపిస్తున్నారు.

టైటిల్ పాత్ర‌లో నాగార్జున న‌టిస్తుండ‌గా రమ్యకృష్ణ అతని భార్య సత్యభామగా కనిపించనుంది.

ఈ ఇద్దరితో పాటు, ఇతర ప్రముఖ తారాగణం హైదరాబాద్ RFCలో జరుగుతున్న షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

Telugu Bangaraju Movie, Kalyan Krishna, Krithi Shetty, Nagarjuna, Ramyakrishna, Ramyakrishna Special Birthday Poster Release From Bangaraju Movie, Soggade Chinni Nayana, Special Birthday Poster-Movie

కుటుంబ సభ్యులందరితో కలిసి చూసేలా బంగార్రాజును అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా ద‌ర్శ‌కుడు కళ్యాణ్ కృష్ణ రూపొందిస్తున్నారు.ఇది అన్ని వ‌ర్గాల వారిని అల‌రించ‌నుంది.అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి జీ స్టూడియోస్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది.

నాగార్జున నిర్మాత.అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తుండ‌గా, సత్యానంద్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.

యువరాజ్ సినిమాటోగ్రాఫర్.

తారాగణం: అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతిశెట్టి, చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ మరియు జాన్సీ

.

#SoggadeChinni #Bangaraju #Ramyakrishna #Special Poster #Krithi Shetty

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు