బిగ్ బాస్ గెస్ట్ హోస్ట్ గా మళ్ళీ రానున్న రమ్యకృష్ణ

Ramyakrishna Again Host Bigg Boss, Star Maa, Tollywood, King Nagarjuna, Bigg Boss, Ramyakrishna

బిగ్ బాస్ షోకి ఊహించని అవాంతరం ఎదురైంది.రేటింగ్ తక్కువగా ఉన్న నాగార్జున హోస్టింగ్ లో సాఫీగా సాగిపోతున్న షోకి ఇప్పుడు కొత్త సమస్య వచ్చింది.

 Ramyakrishna Again Host Bigg Boss, Star Maa, Tollywood, King Nagarjuna, Bigg Bos-TeluguStop.com

కింగ్ నాగార్జున ప్రస్తుతం సోలొమన్ దర్శకత్వంలో వైల్డ్ డాగ్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ ఈ మధ్యనే మళ్ళీ స్టార్ట్ అయ్యింది.

కీలక ఎపిసోడ్స్ షూట్ చేస్తున్నారు.థాయ్ లాండ్ లో ఒక 20 రోజుల షూటింగ్ షెడ్యూల్ ఉంది.

అయితే ఈ షూటింగ్ కోసం కింగ్ నాగార్జున తాజాగా ఫ్లైట్ ఎక్కేసాడు.దీంతో వచ్చే వారం నుంచి మూడు వారాలు ఎపిసోడ్స్ కి ఎవరిని గెస్ట్ హోస్ట్ గా పెట్టాలా అని బిగ్ బాస్ టీం ఆలోచిస్తూ ఉంది.

అయితే గత సీజన్ లో ఓ రెండు ఎపిసోడ్స్ కి రమ్యకృష్ణ హోస్ట్ గా చేసి సందడి చేసింది.ఆమె చేసిన ఎపిసోడ్స్ కి రేటింగ్స్ కూడా బాగానే వచ్చాయి.

శనివారం, ఆదివారంలో షో రేటింగ్ తగ్గకుండా ఉండేలా చూసుకోవాలంటే రమ్యకృష్ణ ఫస్ట్ ఛాయస్ గా కనిపిస్తుంది.

కింగ్ నాగార్జునపై ఉన్న అభిమానం కొద్ది ఆమె కూడా ఈ సారి కూడా మూడు వారల పాటు హోస్ట్ గా చేయడానికి రమ్యకృష్ణ అంగీకరించినట్లు టాక్ వినిపిస్తుంది.

అయితే దీనిపై బిగ్ బాస్ టీం నుంచి ఎలాంటి ప్రకటన బయటకి రాలేదు.కానీ రమ్యకృష్ణ గత సీజన్ లో మాదిరి ఈ సారి కూడా మూడు ఎపిసోడ్స్ ని దిగ్విజయంగా నడిపించే అవకాశం ఉందని నాగార్జునతో పాటు బిగ్ బాస్ టీం కూడా నమ్ముతుంది.

అందుకే ఆమెని ఛాయస్ గా తీసుకున్నారు.ఈ సారి సీజన్ లో రమ్యకృష్ణ హోస్ట్ గా ఎంత ఎంటర్టైన్ చేయగలుగుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube